ప్ర‌జా చైత‌న్య యాత్ర పేరుతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు బుధ‌వారం నుంచి రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ ర్గాల్లోనూ ప‌ర్య‌టించేందుకు పెద్ద కార్య‌క్ర‌మాన్ని త‌లకెత్తుకున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పడిన ఈ పది మాసాల్లోనే న‌వ మోసాలు-న‌వ భారాలు సాగాయ‌ని పేర్కొంటూ ఈ యాత్ర కు శ్రీకారం చుట్టారు చంద్ర‌బాబు.. జ‌గ‌న్ మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాన‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కారం జిల్లాలోని బుడిగి ప్రాంతం నుంచి చైత‌న్య యాత్ర‌ను బాబు ప్రారంభించారు.


అయితే, దీనిపై అధికార ప‌క్షం విమ‌ర్శ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీ టీడీపీలోనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ప‌ది మాసాలే అయినందున ఆయ‌న‌పై ఇప్ప‌టికే మ‌నం అనేక పోరాటా లు చేస్తున్నందున ఇప్పుడు ఇంత పెద్ద కార్య‌క్ర‌మం అవ‌స‌రం ఏమొచ్చింది? అనేది వీరి మాట‌. పైగా ఎన్నిక‌ల‌కు ఇప్పుడే స‌మ‌యం కూడా రాలేదని అంటున్నారు. ఒక‌వేళ వ‌చ్చినా అవి స్థానిక ఎన్నిక‌లేన‌ని, మ‌రి ఇంత‌దానికి అంత చేయ‌డం ఎందుకు? అనేది వారి ప్ర‌శ్న‌.


నిజానికి ఏ ప్ర‌భుత్వానికైనా అధికారంలో కుదురు కునేందుకు క‌నీసం ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌డుతుంద‌ని, ఈలోగా కొన్ని చిన్న‌పాటి పొర‌పాట్లు దొర్లినా వాటిని హైలెట్ చేయ‌డం త‌ప్పుకాద‌ని కానీ ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం వ‌ల్ల మ‌న‌కు ఒరిగేది ఏంట‌ని అంటున్నారు. అంతేకాదు, మ‌న ప్ర‌భుత్వ‌మే ఉండి.. విప‌క్షం ఇలా యాత్ర‌లు కేవ‌లం ప‌ది మాసాల్లోనేచేస్తే.. మ‌నం ఎలా స్పందిస్తామో ఒక్క‌సారి ఆలోచిస్తే బెట‌ర‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల‌కు నొప్పి క‌లిగేదాకా వేచి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఇంకా టీడీపీపై న‌మ్మ‌కం ఏర్ప‌డ‌లేద‌ని గ‌త బాధితులు ఇంకా టీడీపీని మ‌రిచిపోలేద‌ని చెబుతున్నారు.


కేవ‌లం ఈ యాత్ర వ‌ల్ల చంద్ర‌బాబు త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు చేస్తున్నారే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల కోసం కాద‌నే అధికార పార్టీ ప్ర‌చారం జోరుగా సాగుతున్న స‌మ‌యంలో ఇలాంటి యాత్ర‌ల వ‌ల్ల మ‌నం సాధించేది ఏమీ ఉండ‌ద‌ని డ‌బ్బు దండ‌గ త‌ప్ప‌. అని వారు సూచిస్తున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఇప్ప‌టికే యాత్ర ప్రారంభించారు. మ‌రి నాయ‌కులు ఏమేరకు స్పందిస్తారో చూడాలి.
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: