జగన్ ఏదైనా తల పెట్టారంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగానే ఏపీలో ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ కీలకమైన విషయాల్లో నంచివేత ధోరణి అవలంబించకుండా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రైతులకు మేలు చేకూర్చే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారు. ఆ విధంగానే పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతులకు మేలు చేకూర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకం విషయంలో జగన్ అంతే చిత్తశుద్ధితో ఉన్నారు. 2022 నాటికి చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని దృడ సంకల్పంతో జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.


 పశ్చిమగోదావరి జిల్లాలోని సుమారు 15 మండలాలు, కృష్ణా జిల్లాలోని 18 మండలాలు మొత్తం 410 గ్రామాలకు ఈ చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు మేలు చేకుర్చబోతోంది. దీనికోసం ఇప్పటికే 1931 కోట్ల రుణాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టేన్స్ కింద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహాయం అందించేందుకు నాబార్డ్ ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యే కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు గనుక సకాలంలో పూర్తి అయితే 410 గ్రామాల్లోని 4 లక్షల 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. మొత్తం మూడు దశల్లో 53.5 టీఎంసీల సాగునీరు రైతులకు అందుతుంది. 


అలాగే 14 26 లక్షల మంది ప్రజల దాహం తీరే అవకాశం కనిపిస్తోంది. గోదావరి జలాలను మూడు దశల్లో మళ్లించేందుకు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపట్టింది. మొత్తం 4.5 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సీజన్లో అందించాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. దీంతోపాటు వద్ద 14 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ పథకం వేగవంతంగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే రైతులకు మేలు జరిగిందో అదేవిధంగా జగన్ పరిపాలనలోనూ రైతులకు న్యాయం జరుగుతుందని రెండు జిల్లాలోని రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: