మనషులకు కులం, మతం ఉంటాయి. కానీ ప్రేమకు కులం, మతం అంటూ ఉండదు. ప్రేమికులకు ఒక్కటే కులం ఉంటుంది అదే ప్రేమకులం. చిన్నప్పటి నుండి కంటి రెప్పలా పెంచిన తల్లిదండ్రులు ప్రేమ విషయంలో విలన్ లాగా మారిపోతున్నారు. పిల్లలకు అడిగిందల్లా ఇచ్చిన తల్లిదండ్రులు ప్రేమ విషయంలో వారి పిల్లల సంతోషాలను ఎందుకు ఆడుకుంటున్నారు. 

 

నేటి సమాజంలో కులాలు, మతాలు, తగ్గిపోతున్న క్రమంలో కన్న కూతురి కన్నీటిని కూడా లెక్క చేయడం లేదు. కూతురి ప్రేమను అర్ధం చేసుకోకుండా తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తిస్తున్నారు. పేరెంట్స్ కి వారి పిల్లల కంటే పరువు ముఖ్యమవుతుందా...?

 

వారు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డరు. వారి ప్రేమ ఇంట్లో వాళ్లతో చెప్పాలనుకున్నారు. పెద్దల సమక్షంలో వారి వివాహం వైభవంగా చేసుకోవాలని కలలు కన్నారు. వారి ప్రేమను జీవితాంతం పొందాలనుకున్నారు. కానీ వారి చేదు అనుభవం ఎదురై వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఆ యువతీ ఆ ఘటన విశాఖలో చోటు చేసుకుంది.

 

కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ నగరంలో బుధవారం జరిగింది. పెదవాల్తేరు పోలమాంబ దేవాలయం సమీపంలో నివాసముంటున్న యువతి (20), డాబాగార్డెన్స్‌కు చెందిన ఓ యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

 

నాలుగు రోజుల క్రితం ఆ యువకుడు ప్రియురాలి నివాసానికి వెళ్లి తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి పెళ్లి చేయాలని కోరాడు. దీనికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు అతడిని మందలించి పంపేశారు. ఆ తర్వాత వారి ఇంట్లో గొడవలు కావడంతో యువతి మనస్తాపానికి గురైంది. బుధవారం మద్దిలపాలెంలోని సొంతింటికి వచ్చిన ఆమె మేడపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంవీపీ కాలనీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: