దివ్యాంగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు వెంటనే 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిసైడ్ చేయటం సంచలనంగా మారింది. దివ్యాంగులకు ప్రస్తుతం 3 శాతం రిజర్వేషన్లు అమలవుతోంది. దీనికి ఒకశాతం కలిపి 4 శాతానికి పెంచుతు నిర్ణయం తీసుకుంది.

 

మొత్తం రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశానికి, ప్రమోషన్లకు కూడా వర్తింపచేయబోతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అంధత్వం, చూపు మందగించటం సమస్యలున్నవారికి 1 శాతం, మస్తిత్వ పక్షపాతం, కుష్టు వ్యాధిగ్రస్తులు, చలన సంబంధమైన సమస్యలున్నవారు, కండరాల బలహీనత, మరుగుజ్జుతనం, యాసిడ్ దాడి బాధితులకు ఒక్కశాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు.

 

అలాగే, లెర్నింగ్ డిసేబులిటి, ఆటిజం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి  1 శాతం రిజర్వేషన్ ఫలాలు అందుకోబోతున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఐదుగురికి మించి స్టాఫ్ ఉంటే ఇవ్వాల్సిన ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ వర్తింపచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చెప్పారు.

 

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వివిధ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందనే నివేదికలు జగన్ కు అందినట్లు సమాచారం. అదే సమయంలో చంద్రబాబు అసలు నియామకాలే జరపలేదు. పైగా తమకు కావాల్సినట్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిలోనే వేలాది మందిని నియమించేసేకున్నారు.

 

దానివల్ల నిజంగా అర్హులకు మొండిచెయ్యే ఎదురయ్యింది. మామూలుగానే నియామకాలు  చేయని కారణంగా నిరుద్యోగులు పెరిగిపోయారు. అందులో దివ్యాంగుల సంగతి ప్రత్యేకంగా చెప్పకనక్కర్లేదు. ఈ నేపధ్యంలోనే  పాదయాత్ర సమయంలో దివ్యాంగులు జగన్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుని రిజర్వేషన్ల శాతం పెంచాలని అడిగారు. దాంతో ఇపుడు రిజర్వేషన్లను 3 నుండి 4 శాతానికి పెంచుతూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: