ఈ మధ్యకాలంలో పోలీసులు అంటే ఎవరికీ కాస్తయినా భయం లేకుండా పోయింది... ఒకప్పుడు అయితే  పోలీసులను చూసి ప్రజలు ఎంతగానో భయపడేవారు. కానీ నేటి కాలంలో మాత్రం ఆ భయం ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు పైన దాడులు చేసే ఘటనలు  ఎన్నో తెర మీదికి వస్తూనే ఉన్నాయి.  తమ వాహనాన్ని ఆపినందుకు  పోలీసులను చితకబాదిన సంఘటనలు... లేదా ఇతర గొడవల కారణంగా పోలీసులపై దారుణంగా దాడి చేసిన ఘటనలో ఈరోజుల్లో  ఎక్కువైపోతున్నాయి. కనీసం కాకి డ్రెస్ కి  కూడా కనీస విలువ ఇవ్వడం లేదు. దీంతో ప్రజలను చూసి పోలీసులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది... ఓ వ్యక్తి పై చీటింగ్ కేసు నమోదైంది. ఇక ఆ వ్యక్తికి అరెస్ట్ వారెంట్ ఇచ్చేందుకు వెళ్లాడు కానిస్టేబుల్. ఇక ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళగానే కానిస్టేబుల్ పై దాడి చేశాడు సదరు వ్యక్తి. ఏకంగా  తొడ భాగంలో కొరికి తీవ్రంగా గాయపరిచాడు.ఈ ఘటన  స్థానికంగా కలకలం రేపింది. ఇక కానిస్టేబుల్ కొరికిన వ్యక్తిని  వెంటనే అదుపులోకి తీసుకుని  కటకటాల వెనుకకు తోసారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. యూసఫ్ గూడ కృష్ణ కాంత్ పార్క్ సమీపంలో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తి పై  జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు. 

 

 ఈ క్రమంలోనే సదరూ  పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ విష్ణు బుధవారం మధ్యాహ్నం శ్రీనివాసు వారెంట్ జారీ చేసేందుకు అతని ఇంటికి వెళ్ళాడు. ఇంతలో  తలుపులు తీసిన శ్రీనివాస్ వెంటనే కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కుడికాలిని తీవ్రంగా కొరికాడు శ్రీనివాస్. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ ఇతర సిబ్బంది సాయంతో నిందితుడిని అదుపులోకి జూబ్లీ హిల్స్  పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కానిస్టేబుల్ పై దాడి చేసిన ప్రాంతం ఎస్ఆర్ నగర్ పరిధిలోది కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: