దేశంలో స్కాంలు, రాబడిలు, హత్యలు, హత్యాచారాలు చేసిన వారు హాయిగా తిరుగుతున్నారు.. కాని చిల్లర దొంగతనాలు చేస్తున్న వారు మాత్రం శిక్షలు అనుభవిస్తున్నారు అని నిరూపిస్తున్న ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే.. సమాజంలో రోజు రోజుకు జరుగుతున్న సంఘటనలు మనుషుల ప్రవర్తనను సూచిస్తున్నాయి.. కనికరం, దయ లాంటి పదాలు ఎప్పుడో సముద్రం అడుగులో దాక్కుని, లోకంలో జరిగే నికృష్టపు పనులను గమనిస్తున్నాయి.

 

 

ఇక ఇప్పుడు మనుషుల మనసుల నిండా కౄరత్వం నిండిపోయింది.. సాటి వ్యక్తి కళ్లముందు చస్తున్న గాని నాకేంటి అని అంటున్నాడే కాని, తనకు తోచిన సహాయం అందించడం లేదు... సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడు పడవోయ్' అని చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు గారి మాటలు ఇప్పుడు పనికి రాని పదాలుగా మారాయి. ఇకపోతే కంఫర్ట్‌జోన్‌ లో ఉన్నవారు తమ గురించే తప్ప పక్కవారి గురించి అసలు ఆలోచించడంలేదు.. అంటే తమకు కలిగితే అది బాధ. పక్కవారు అనుభవిస్తే అది హాయి అనేలా ప్రవర్తిస్తున్నారు..

 

 

ఇకపోతే జైపూర్ నుండి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ కు 24 సంవత్సరాల వయస్సున్న ఓ దళిత యువకుడు తన సోదరుడితో కలిసి వెళ్లగా, తమ షాపు నుంచి డబ్బుని దొంగతనం చేశారంటూ సదరు షోరూమ్ కు చెందిన సిబ్బంది దళిత యువకులపై దాడికి దిగారు. రాక్షసుల్లా ప్రవర్తిస్తూ, యువకులిద్దరి బట్టలూడదీసి, జననాంగాలపై పెట్రోల్‌ పోశారు.

 

 

అయితే  రాజస్థాన్‌ లోని నాగౌర్‌ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఫిబ్రవరి 16న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇకపోతే ఈ ఘటనపై బాధిత యువకులు ఇద్దరూ బుధవారం ఫిబ్రవరి 19, అంటే నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బంకు దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, దాడికి పాల్పడ్డ ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: