సర్వసాధారణంగా జంతువులకు పక్షులకు మనుషుల మీద కోపాలు రావు. ఒకవేళ వస్తే ఆ పరిస్దితి ఎంత భీభత్సంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. ఇలాంటి పరిస్దితులను తెలుసుకోవడానికి, చాలా సందర్భాల్లో అనుభవించిన వారి అనుభవం చాలు .. ఇక కొందరిని చూస్తే జంతువులు పగబట్టినట్లుగా అనిపిస్తుంది. దారివెంట పోతుండగా మరీ వెనక్కి వచ్చి కుమ్మేస్తాయి.

 

 

కుక్కలైతే పిక్కలుపట్టి వదలనే వదలవు. ఇక పక్షులో, అకారణంగా తలపైన తన్నడం, లేదా పొడవడం చేస్తాయి.. మరి గత జన్మ పగలో ఏమో తెలియదు గాని పిచ్చ పిచ్చగా కుమ్ముకుంటాయి.. ఇకపోతే సామాన్యంగా ఎద్దులకు ఎర్ర రంగంటే అసలు పడదని తెలుసుగా.. ఈ విషయాన్ని చాలా సినిమాల్లో చూపించారు కూడా.. ఆయితే ఇలాంటి ఘటనను సినిమాల్లో చూసాం గాని, నిజంగా కళ్లముందు జరిగితే చూడలేదని బాధపడేవారు కూడా ఉంటే మీ కోరికను ఈ వీడియోలో తీర్చుకోండి.

 

 

ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్న దృష్యంలో ఒక యువకుడు ఎరుపురంగు చొక్కా వేసుకుని వీధిలోకి వచ్చాడు. అతన్ని చూసిన ఓ ఎద్దులో ఆవేశం కట్టలు తెంచుకోగా, అక్కడున్న ఎవరి జోలికి వెళ్లకుండా కేవలం ఎరుపు రంగు ధరించిన ఆ యువకుడిని మాత్రం కుళ్లబొడిచింది. అతను  కిందపడినా వదలకుండా, మరీ కుమ్మేసింది. ఈ ఘటనను చూసిన స్దానికులు కొందరు కర్రలతో వచ్చి దాన్ని బెదిరిస్తూ, కొట్టినా గాని వెళ్లినట్లే వెళ్లి మరి వెనక్కి వచ్చి కుమ్మేసింది..

 

 

ఇలా పలుమార్లు జరిగింది.. ఇక యూపీలో జరిగిన ఈ సంఘటన తాలూకు దృష్యాలన్ని ఆక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అవగా, ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది... దీన్ని బట్టి అర్ధం అయ్యింది ఏంటంటే జంతువులకు ఎప్పుడు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండాలి. అవి మనవైనా, మనుషుల్లా  ఆలోచించలేవు..

 

 

ఇదిగో ఇలా అకస్మాత్తుగా మీదపడి ఫుట్‌బాల్ ఆడేస్తాయి. ఇంకా నయం, ఆ యువకుడు బ్రతికాడు. స్దానికులు కనుక అడ్డుకోకుంటే పైకి పోయేవాడు. మరి రోడ్డుపై అంతమంది ఉండగా ఇతన్నే తరమడం నిజంగా ఆశ్చర్యమే..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: