ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంత్రులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ కు ఈ మధ్య కాలంలో పార్టీలో కొందరు నేతలు గ్రూపు రాజకీయాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రూపు రాజకీయాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగిపోతూ ఉండటంతో తాజాగా సీఎం జగన్ గ్రూపు రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టారు. గుంటూరు జిల్లాలో ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే రజనీ వర్గాల మధ్య విబేధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 
 
వైసీపీ పార్టీలో ఇటీవల చేరిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణదేవరాయలుపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులను పిలిపించి ఈ గ్రూపు రాజకీయాల విషయంలో బాధ్యతలు తీసుకొని వ్యవహారాలను చక్కబెట్టాలని సీఎం జగన్ సూచించారు. 
 
పార్టీలోని నేతల మధ్య విబేధాల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని గ్రూపు రాజకీయాలపై దృష్టి పెట్టి వీలైనంత తక్కువ సమయంలో సమస్యను పరిష్కరించాలని జగన్ ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు సీఎం జగన్ ఇంచార్జ్ మంత్రులకు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు దిశగా పని చేయాలని సీఎం జగన్ ఇంచార్జ్ మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. 
 
సీఎం జగన్ ఈరోజు కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో దాదాపు 4,47,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. సీఎం జగన్ అధికారులను ప్రాజెక్ట్ పురోగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన తరువాత సీఎం జగన్ ప్రాజెక్ట్ వద్దే జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.             

మరింత సమాచారం తెలుసుకోండి: