టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ప్ర‌జా చైత‌న్య యాత్ర రెండో రోజుకు చేరుకుంది. తొలిరోజు ప్ర‌కాశం జిల్లాలో నిర్వ‌హించిన ఈ యాత్ర‌లో చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగాల‌తో అద‌రగొట్టారు. అయితే, నిజానికి ఈ యాత్ర ల‌క్ష్యం.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ప‌ది మాసాలు పూర్తి అయిన నేప థ్యంలో ఈ ప్ర‌భుత్వం ఏమీ సాధించ‌లేక పోయింద‌ని, తాను అధికారంలో ఉంటే బాగుండేద‌ని చెప్పుకోవ డ‌మే.



అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలిపై చైత‌న్యం చేయ‌డం. నిజానికి ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో విప‌క్షాలు ప్ర‌జ‌ల కోసం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం త‌ప్పుకాదు. ఇప్పుడు చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌జా చైత‌న్య యాత్ర‌ను కూడా త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, కాన్సె ప్ట్‌కు దూరంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డ‌మే విమ‌ర్శ‌లకు తావిస్తోంది. చైత‌న్య యాత్ర‌లు అచేత‌న యాత్ర‌లుగా మారిపోయాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



చంద్ర‌బాబు చేయాల్సిన ప‌నిని వ‌దిలేసి.. జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నారని అంటున్నారు. ఈ మాత్రం దానికి ఎర్ర‌టెండ‌లో ఆయ‌న రోడ్ల మీద‌కు రావాల్సిన అవ‌స‌రం ఏంట‌ని కూడా అనుకుంటున్నారు.  ఏసీ రూంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి తిట్టిపోసినా.. అనుకూల మీడియాల్లో భారీ ఎత్తున క‌వ‌రేజ్ వ‌స్తుంది క‌దా! అనేది వీరి ప్ర‌శ్న‌.అదేస‌మ‌యంలో స్వోత్క‌ర్ష‌ల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్నారు. గ‌తంలో తాను అద్భుతంగా పాలించా నని చెప్పుకొస్తున్నారు.



ప్ర‌జ‌లు త‌ప్పు చేశార‌ని అనేస్తున్నారు. నిజానికి చంద్ర‌బాబు మంచి వారే అయినా.. ఆయ‌న త‌మ్ముళ్లు చేసిన విష‌యాలు, దూకుడు వ్య‌వ‌హారాలు తెలిసి కూడా ఆయ‌న మౌనంగా ఉండ‌డం చూస్తూ.. భ‌రించ‌డం వ‌ల్లే పార్టీ ఇలా త‌యారైంద‌నేది వాస్త‌వం. ఈ విష‌యాల‌పై అంత‌రంగ మ‌థ‌నం మానేసి.. ఇంకా గొప్ప‌లు, మెప్పుల కోసం త‌పిస్తుండ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మో.. ఏమేర‌కు ఫ‌లిత‌మిస్తుందో బాబు ఊహించుకోవాల‌ని సూచిస్తున్నారు. చైత‌న్యం ముందు పార్టీలోను,త న‌లోనూ రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: