సమాజంలో కొందరు వారి అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిలో వ్యభిచారాలకు అలవాటు పడుతారు. మరికొందరు దానినే వృత్తిగా మార్చుకొని అమాయకులైన వారిని ఈ రంగంలోకి దింపుతారు. వారి అవసరాలను పసిగట్టి వారు చెప్పింది చేస్తే వాళ్లకు కావాల్సినవి ఇచ్చేస్తాం అంటారు. మరికొందరిని పని ఇప్పిస్తాం అని మాయ మాటలు చెప్పి ఈ చీకటి కోణంలోకి తోస్తారు. ఇలా వారివారి అవసరాలను బట్టి అనుగుణంగా మార్చుకొని చీకటి కోణాల్లో అమాయకులతో వ్యభిచారం నడిపిస్తూ వారు డబ్బులు పోగు చేసుకుంటున్నారు.

 

దేశంలోని ప్రధాన నగరాలలో వ్యభిచారం చేయిస్తుంటారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఫ్యామిలీస్ ఉండే కాలనీలో నిర్వహిస్తున్న సెక్స్‌ రాకెట్‌ను చేధించిన పోలీసులు 8 మంది యువతులను పోలీసులు రక్షించారు. ఈ వ్యభిచారం నడుస్తున్నానలుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్‌ వర్కర్లలో ఏడుగురు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిని అక్రమ మార్గాల్లో ఒడిశాకు తీసుకొచ్చి వ్యభిచార చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

బంగ్లాదేశ్ యువతులను వారి స్వదేశానికి తిరిగి పంపించేందుకు భువనేశ్వర్ పోలీసులు ఢిల్లీలోని విదేశాంగ శాఖను సంప్రదించారు. వారికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన పోలీసులు బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమాచారమిచ్చారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత వారిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక వారిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారులు.. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)కి అప్పగిస్తుందని వెల్లడించారు.

 

రైడింగ్‌లో పట్టుబడిన మరో యువతిని కోల్‌కతా నివాసిగా గుర్తించి ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వీరందరినీ సెక్స్ మాఫియా కిడ్నాప్ చేసి అక్రమంగా వ్యభిచార కూపంలోకి దించిందని పోలీసులు చెబుతున్నారు. వీరిలాగే కనిపించకుండా పోయిన ఎంతో మంది మహిళలు వ్యభిచార కేంద్రాల్లో బతుకీడుస్తున్నట్లు తెలుస్తోందని, అలాంటి వారిని రక్షించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: