ప్రతిపక్షంలో ఉన్నా... అధికార పక్షంలో ఉన్నా... తన అభిప్రాయాన్ని, మనసులో ఉన్న మాటలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంటారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి.. ప్రజ్ఞా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ఇండియా ఆన్ ఎకనామిక్ సూపర్ పవర్ 2030 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ సుబ్రమణ్య స్వామి... జీఎస్టీ, ఆదాయపన్ను వసూళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈయన అనేకసార్లు కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. తాజాగా జీఎస్టీ పై ఈయన చేసిన వ్యాఖ్యలు ..ఇప్పుడు బీజేపీలో దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.

 

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 1990 వరకు భారత్ అంతగా అభివృద్ధి చెందలేదని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధిస్తోందని తెలిపారు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అవలంబించిన సోవియట్ ఆర్థిక విధానాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారుఒక సందర్భంంలో కాంగ్రెస్ ప్రధానులను పొగుడుతూ.. మోదీ సర్కార్‌పై చురకలు వేశారు. జీఎస్టీ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి చర్యగా పేర్కొన్నారు.

 

అసలు కరంటే లేకపోతే.. జీఎస్టీ పత్రాన్ని ఎలా అప్‌లోడ్‌చేయాలని రాజస్థాన్‌ రైతు తనను ప్రశ్నించారని.. ‘నీ తలమీద అప్‌లోడ్‌చేసుకొని వెళ్లి ప్రధాని మోదీకి చూపెట్టాలని అతనికి తాను సమాధానమిచ్చినట్లు స్వామి తెలిపారు. పదిశాతం చొప్పున మన దేశం వృద్ధిచెందితే.. చైనాను తేలికగా అధిగమించవచ్చన్నారు.

 

ప్రస్తుతం జీఎస్టీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. భవిష్యత్తు లో జీఎస్టీతో మంచి ఫలితాలుంటాయని దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్షయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: