తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడచిన తొమ్మిది నెలలుగా ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు ? మీడియా వేసే ప్రశ్నలకు భయపడి సమాధానాలు చెప్పలేకే ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేదని నారా లోకేష్ కొత్త విషయం చెప్పేశారు. జగన్ సిఎం అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదన్నది వాస్తవమే. మొదటి నుండి కూడా జగన్ మీడియా సమావేశాలకు దూరమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడో అవసరమైతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టరు.

 

ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టలేదన్న విషయాన్ని పట్టుకుని జగన్ భయపడిపోతున్నాడు అని లోకేష్ కొత్త విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబునాయుడు దగ్గర పదేళ్ళు పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పై ఐటి దాడులు జరిగితే స్పందించటానికి పదిహేను రోజులు పట్టింది. పెండ్యాలతో పాటు ఐటి సోదాలు జరిగిన మరో ముగ్గురు వ్యక్తులు కూడా టిడిపితో సంబంధాలు ఉన్నవారే.

 

సోదాలు జరిగిన రెండు రోజుల తర్వాత ఐటి శాఖ రిలీజ్  చేసిన ప్రెస్ నోట్ లో తమ సోదాల్లో రూ 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినందుకు ఆధారాలు దొరికినట్లు స్పష్టంగా చెప్పింది. ఆ విషయాన్ని మాత్రం లోకేష్ మాట్లాడటం లేదు. శ్రీనివాస్ ఇంటిపై ఐటి సోదాల్లో ఏమీ దొరకలేదని అధికారికంగా చెప్పినా రూ 2 వేల కోట్లు దొరికిందని వైసిపి నేతలు చెప్పటం తప్పంటున్నారు. అంటే రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగిందని ఐటి శాఖ చెబుతున్న విషయాన్ని మాత్రం లోకేష్ మాట్లాడటం లేదు.

 

పైగా ఐటి శాఖ దాడుల గురించి మాట్లాడమంటే జగన్ రూ. 43 వేల కోట్ల దోచేసుకున్నాడని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నాడని, జగన్ పై చార్జిషీట్లు ఉన్నాయనే పాత పాటతో ఎదురుదాడే చేశారు. చంద్రబాబు వ్యక్తిగత భద్రత గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సెక్యురిటినే ఇవ్వాలని లోకేష్ వాదించటమే విచిత్రంగా ఉంది. సిఎంగా ఉన్నప్పటికి మాజీ అయినప్పటికి తేడాలుంటాయంటే ఈ మందలగిరి అంగీకరించకపోవటమే విచిత్రంగా ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: