తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు రాష్ట్రంలోని ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లోని 15 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మార్చి నెల 30వ తేదీలోగా ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రెషిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. 
 
ప్రభుత్వం గతంలోనే ఎస్సీ డిగ్రీ మహిళా కళాశాలల్లో 19 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాజాగా ప్రభుత్వం గతంలో విడుదల చేసిన పోస్టులతో పాటు మరో 15 పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రాష్ట్రంలో 34 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పీజీలో 50 శాతం అర్హత మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులు అర్హులు. 
 
ప్రభుత్వం ఫిబ్రవరి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 10వ తేదీ వరకు గతంలో గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించకుండా వారి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఉపయోగించి అప్ డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సందేహాల నివృత్తి, ఇతర వివరాల కోసం 040 23317140 హెల్ప్ లైన్ నంబర్ లో సంప్రదించవచ్చు. 
 
గతంలో ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీ అభ్యర్థులకు పీజీలో 55 శాతం మార్కులు వస్తే మాత్రమే ప్రిన్సిపాల్ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. మార్కుల అర్హత పరిమితిని 55 శాతం నుండి 50 శాతానికి తగ్గించినట్టు ఛైర్మన్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అర్హత మార్కులు తగ్గించడం వలన దరఖాస్తుల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: