ప‌సి పిల్ల‌లు చిన్న చిన్నగా న‌డ‌వ‌డం మొద‌లు పెడుతున్నారు అనుకునే స‌మ‌యానికి వాక‌ర్లు కొనేస్తున్నారు నేటి త‌రం. పిల్లల మీద ప్రేమతో వారికి ఎప్పటికప్పుడు అన్నీ అమర్చాలనుకుంటారు తల్లిదండ్రులు. అయితే అవి వారికి మేలు చేస్తాయా లేదా అన్నది మాత్రం ఆలోచించ‌డం లేదు. ఉదాహరణకి పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చాలు, వారికి నడక బాగా రావాలంటూ వారికి బేబీ వాకర్లు కొంటాం. దీంతో పిల్లలు కూడా హాయిగా ఇల్లంతా తిరుగుతుంటారూ. అయితే ఇవి పిల్లలకి మంచి చేయ్యకపోగా నష్టం కలిగిస్తాయి అంటున్నారు పరిశోధకులు. బేబీ వాకర్ల వల్ల చిన్నారుల్లో పెరుగుదల, అభివృద్ధి కొంత ఆలస్యం అవుతుందని వీరు చేసిన పరిశోధనల్లో స్పష్టం అయిందట. అలాగే పిల్ల‌ల‌కు దొడ్డికాళ్ళు వ‌స్తాయి అంటారు కాలి న‌డ‌క ఎడ‌మెడ‌ముగా వేయ‌డం. కాళ్ళ మ‌ధ్య దూరం కూడా పెరుగుతుంది అంటారు.

 

పిల్ల‌లు ఏ వ‌య‌సులో జ‌ర‌గాల్సిన‌వి ఆ వ‌య‌సులో జ‌రుగుతాయి. అలాగే పాక‌డం, బోర్లాప‌డ‌టం, న‌డ‌వ‌డం వాటి గురించి ప్ర‌త్యేకించి ఆలోచించ‌క్క‌ర్లేదు. ఎప్పుడు రావ‌ల్సిన న‌డ‌క అప్పుడు వ‌స్తుంది. పూర్వంలో మూడు చెక్రాల చ‌క్క బండి ఉండేది. అప్ప‌ట్లో ఆ చ‌క్క బండిని తోసుకుంటూ వెళుతూ పిల్ల‌లు న‌డ‌క‌ను నేర్చుకునేవారు. దాంతో పిల్ల‌ల‌కు మంచి ఎక్స్‌ర్‌సైజ్, వాకింగ్‌లానూ అలాగే న‌డ‌క కూడా చాలా ఈజీగా వ‌చ్చేది.  ఆ చెక్క బండిని తోసేట‌ప్పుడు అప్పుడ‌ప్పుడు ప‌డిపోవ‌డం మ‌ళ్ళీ తిరిగి లేచి నిలబడటం, నడవటం వంటివి కొంత ఆలస్యంగా అయినా చాలా చ‌క్క‌గా వ‌చ్చేవి. బేబీ వాకర్‌ అలవాటైన పిల్లలు దానిమీద ఎక్కువగా ఆధారపడుతున్నారని ఫలితంగా నడక, పాకడం, నిలబడటం వంటి దశలన్ని చిన్నారుల్లో ఆలస్యంగా జరుగుతున్నట్లు తేలింది. కాబట్టి తప్పనిసరైతే తప్ప వాకర్లు వాడొద్దని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.. 

 

అలాగే చాలా మంది త‌ల్లిదండ్రులు ఏదో ప‌నులు చేసుకోవ‌డం కోసం చంటిపిల్ల‌ల‌ను వాక‌ర్‌లో వేసేసి చేసుకుంటూ ఉంటారు. దాంతో పిల్ల‌లు అందులోనే చాలా సేపు వ‌ర‌కు ఉండిపోతారు. కొంత మంది కూర్చుంటే మ‌రి కొంత మంది న‌డుస్తూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు న‌డుం నొప్పి కూడా వ‌చ్చే  ప్ర‌మాదం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: