ఒకవైపు టీడీపీ నాయకులే టార్గెట్ గా ఐటీ శాఖ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించడంతో పాటు, ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో పాటు మరి కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉండగా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల మధ్య తిరుగుతున్నాడు. ఈ వ్యవహారం వాడి వేడిగా ఉండగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తులను ప్రకటించారు. తాము కొనుగోలు చేసిన వివరాల ప్రకారమే ఆస్తులను ప్రకటిస్తున్నామని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. హెరిటేజ్ ద్వారా ఏడాదికి 83 కోట్ల ఆదాయం లభించింది అంటూ మొత్తం తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ఆయన వివరించారు. లోకేష్ ఆస్తుల ప్రకటన సందర్భంగా వైసీపీ నేతలకు కూడా సవాల్ విసరడంతో దీనిపై చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు.


 దేశంలో అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు అంటూ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అసలు ఇంత హడావుడి సమయంలోనూ లోకేష్ ఆస్తులు ప్రకటించడం చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆయన చెప్పారు. లోకేష్ చంద్రబాబు ఇద్దరి వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదంటూ ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను గెలిపించేందుకు చంద్రబాబు తంటాలు పడ్డారని,  దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా ఉన్న అహ్మద్ పటేల్ కు సుమారు 400 కోట్లు పంపించారని వస్తున్న వార్తల తరుణంలో లోకేష్ ఆస్తులను ప్రకటించారని ఆయన అన్నారు. 


ప్రస్తుతం ప్రకటించిన ఆస్తులతో పాటు తమ కుటుంబానికి ఉన్న బినామీ ఆస్తులను కూడా లోకేష్ ప్రకటించి ఉంటే బాగుండేదని, అప్పుడు ప్రజలకు నిజమేంటో తెలిసి ఉండేదని  శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు అవినీతి అక్రమాలను బయటపెట్టిన ఐటీ  దాడులపై చంద్రబాబు నోరు విప్పక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు అని విమర్శించారు గతంలో బీజేపీ వామపక్ష పార్టీలు చంద్రబాబు అవినీతిపై పుస్తకాలు వేసి పంచిపెట్టిన  విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా అంటూ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 


చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఐటీ దాడులపై స్పందించాలని కోరారు. ఆయనకు  ధైర్యం లేదు కబాట్టే మొన్నటి వరకు హైదరాబాదులో దాక్కుని ఇప్పుడు అరెస్ట్ భయంతో ప్రజల్లోకి వచ్చారు ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ వ్యవహారం మరికొద్ది రోజుల్లో తేలిపోతుందని, అప్పుడు చంద్రబాబు బండారం బయటపడుతుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: