ఎంత ఫ్రెండ్స్ అయినా ఒకరి వ్యవహారంలో మరొకరు వేలు పెడితే రియాక్షన్ వేరేగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ లో గాని, తెలంగాణా లో గాని సొంత పార్టీ నాయకుల తోనే విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఒక నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టడం.వల్లే మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య వైరం కొనసాగుతూ ఉంటుంది. తాజాగా తెలంగాణలో ఇదే రకంగా ఎమ్మెల్యేల మధ్య  వివాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే తండ్రి పదవి విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రేపింది. అంతకు ముందు వరకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మంచి స్నేహితులుగా ఉండేవారు. కానీ ఒక నియోజకవర్గంలో మరొకరు పెత్తనం చేసేందుకు ప్రయత్నించడంతో అది కాస్త ఈ విధంగా బెడిసికొట్టింది. 


వివరాల్లోకి వెళితే... ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ బాగా బలం ఉంది. ఈ జిల్లాలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా బీగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో అలా స్నేహం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల సహకార ఎన్నికలు వచ్చాయి. తన తండ్రి కృష్ణమూర్తిని డిసిసిబి చైర్మన్ లేదా డిసిఎంఎస్ చైర్మన్ గా చేయాలనే ఆలోచనలో గణేష్ గుప్త ఉన్నారు. దీనికోసమే సొసైటీ డైరెక్టర్ గా తన తండ్రి ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గణేష్ గెలిపించుకున్నారు. ఆయనతో పాటు ఆ సొసైటీ డైరెక్టర్ లు మొత్తం వైసీపీ వారే కావడంతో ఆయనే సొసైటీ చైర్మన్ అవుతారని భావించిన గణేష్ గుప్తా మంత్రి కేటీఆర్ ద్వారా పై పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. 


అయితే దీనికి ఆర్మూర్ ఎమ్మెల్యే jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి అడ్డు తగిలారు. గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి సొసైటీ చైర్మన్ అవ్వాలంటే jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందేనని పార్టీ అధిష్టానం కూడా తేల్చిచెప్పడంతో ఈ ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. ఎందుకంటే గణేష్ గుప్తా సొంత గ్రామం jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి నియోజకవర్గంలో ఉండడమే. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కూడా మౌనంగా ఉండడంతో పాటు ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు కలగ చేసుకోకూడదు అని భావించే అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. తండ్రి పదవి కోసం జీవన్ రెడ్డికి ఎంతగా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఆయన ఒప్పుకోకపోవడంతో గణేష్ గుప్తా తండ్రి కనీసం సొసైటీ అధ్యక్షుడు కూడా కాలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: