తెలంగాణలో కందులు కొనుగోలుపై రైతుల్లో ఎందుకు అందోళన వ్యక్తం అవుతోంది? వ్యవసాయ శాఖ కంది పంట విస్తీర్ణంపై తయారు చేసిన రికార్డులు సరిగ్గా లేకపోవడంతో ...పంట కొనుగోలులో జాప్యం జరుగుతుందా ? కంది పండించిన రైతుల సమస్యకు పరిష్కారమేంటి..? ప్రభుత్వం ఏం చేయబోతుంది? 

 

తెలంగాణలో కంది పండించిన రైతులు పంటను అమ్మేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కనీస మద్దతు ధర క్వింటాలకు 5 వేల 8 వందల రూపాయలతో కంది పంటను కొనుగోలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ధరతో 47వేల 5వందల క్వింటాళ్ల కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా వందకుపైగా కంది కొనుగోలు కేంద్రాలను రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు క్వింటాలకు 4 వేల 8 వందల రుపాయల నుంచి 5 వేల రూపాయల వరకు ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధరతో వ్యాపారులు లబ్ది పొందకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం జాగ్రతలు తీసుకుంది. అందులో భాగంగా ఖరీఫ్ లో కందులు పండించిన రైతుల వివరాలను వ్యవసాయశాఖ నుంచి మార్క్‌ఫెడ్ తీసుకుంది. ఆ జాబితాలో ఉన్న రైతుల నుంచే కందులు కొనుగోలు ప్రారంభించింది మార్క్ ఫెడ్.

 

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తెలంగాణలోని పలు జిల్లాలో వ్యవసాయ శాఖ ఇచ్చిన రికార్డుల్లో కందులు పండించిన రైతుల పేర్లు మిస్ అయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కంది రైతులు పంటను అమ్ముకునేందుకు మార్క్‌ఫెడ్‌కు తీసుకొస్తే అందులో కొందరి పేర్లు ఉండటం లేదు. వ్యవసాయ శాఖ ఇచ్చిన రికార్డుల్లో రైతుల పేర్లు లేకపోవడంతో... వారి పంట కొనుగోలు విషయంలో మార్క్ ఫెడ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఈ పరిస్థితి ఉమ్మడి మహబుబ్‌నగర్, వికారాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల్లో ఉంది. దీంతో కంది పండించిన రైతులు అందోళన చెందుతున్నారు. అయితే రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  ప్రకటించారు.

 

ఈ పరిస్థితులపై ఇప్పటికే సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ...రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేసే విధంగా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: