ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. అతి వేగం, అధిక సంఖ్యలో వాహనాలలో ప్రయాణికులు ప్రయాణించటం వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం వలన కూడా కొన్ని సందర్భాలలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుంటున్న ఈ ప్రమాదాల వలన మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 
 
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చుండూరు మండలం చినపరిమి దగ్గర పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ లో ప్రయాణించేవారిలో నలుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ట్రాక్టర్ లో ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వివాహ వేడుకకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
 
స్థానికులు ప్రమాదంలో గాయాలపాలయిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణం చేయటం కూడా వలన కూడా ట్రాక్టర్ అదుపు తప్పి ఉండవచ్చని సమాచారం. 
 
తెనాలిలో తీవ్ర గాయాలపాలైన వారికి చికిత్స అందుతుండగా వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తెనాలిలోని పెళ్లికి వెళ్లి చుండూరులోని మాలపల్లికి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడింది. మృతులను చూసి వారి బంధువులు గుండెలదిరేలా రోదిస్తున్నారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. విషయం తెలియటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.                            

మరింత సమాచారం తెలుసుకోండి: