రాజకీయ ప్రత్యర్ధులపై కేంద్రప్రభుత్వంలోని బిజెపి ఐటి రెయిడ్స్ చేయిస్తోందనే ఆరోపణలు బాగా పెరిగిపోతోంది. సోదాల్లో ఎవరు తగులుకుంటారు ? ఎవరు తప్పించుకుంటారు ? అన్నది వేరే సంగతి. ముందైతే రాజకీయంగా బాగా అల్లరి మొదలైపోతోంది కదా ? తాజాగా ఏపిలో జరుగుతున్న రచ్చను చూసిన వారికి ఎవరికైనా ఈ విషయం అర్ధమైపోతుంది. పైగా సోదాల తర్వాత ఐటి శాఖ అధికారులు జారీ చేస్తున్న ప్రెస్ నోట్ కూడా స్పష్టత ఉండటం లేదు. దాంతో  వివాదాలు బాగా ముదిరిపోతున్నాయి.

 

ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సిబిఐ, ఐటి, ఈడి లాంటి దర్యాప్తు సంస్ధలు బాగా అక్కరకు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. పై దర్యాప్తు సంస్ధలను ప్రయోగించే ప్రత్యర్ధులను అదుపులో పెట్టుకుంటారనే ఆరోపణలకు కొదవైతే లేదు. కర్నాటక కాంగ్రెస్ ప్రముఖ నేత డికె శివకుమార్, కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేతలైన  చిదంబరం, అహ్మద్ పటేల్ లాంటి వారిపై  దాడులు, నోటీసులు, అరెస్టులంతా ఇందులో భాగమే.

 

ఇప్పుడిదంతా ఎందుకంటే ఐటి దాడులకు సంబంధించి  బిజెపి నెక్ట్స్ టార్గెట్ ఎవరు ? అనే విషయమై విస్తృతమైన చర్చ జరుగుతోంది.  ప్రత్యర్ధులు చాలామందే ఉన్నా అందరికన్నా ముందుగా బిజెపి చూపు ప్రశాంత్ కిషోర్ (పికె)పైనే పడిందని ప్రచారం జరుగుతోంది. పికె అంటే బిజెపికి బద్ధశతృవనే చెప్పాలి. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిపోయిన పికె ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కాంట్రాక్టు కుదర్చుకుంటే వారికి ఎన్నికల వ్యూహాల్లో పనిచేసి పెడుతుంటాడు.

 

తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కు పికె అందించిన రాజకీయ వ్యూహాల వల్ల అఖండ మెజారిటి సాధ్యమైందనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో జరగబోతున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, డిఎంకె గెలుపు కోసం పికె పనిచేస్తున్నాడు. ఇలా చాలా బిజీగా ఉన్న పికె  వసూలు చేసే ఫీజు కూడా వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని సమాచారం.

 

అయితే అంత భారీ ఫీజును వసూలు చేస్తున్న పికె దానికి తగ్గ ట్యాక్సులు మాత్రం కట్టడం లేదని సమాచారం అందిందట. అందుకనే పికెపై దాడి చేస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలిపోతాయని బిజెపి ఆలోచిస్తోందట. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: