ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పరిపాలన విషయంలో అభివృద్ధి విషయంలో దూసుకుపోతున్నారు. కులం, మతం, ప్రాంతీయం పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ ఫలాలు అందేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని ముందుగానే నెరవేర్చడానికి ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారంలోకి రావడం తోనే కొద్ది నెలల వ్యవధిలో గతంలో పాదయాత్రలో నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయమందిచేందుకు తమ ప్రభుత్వం వెనుకాడని ఇచ్చిన మాట తాజాగా నెరవేర్చారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయమందిచేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు.

 

అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్ట‌నున్న‌ ‘జగనన్న చేదోడు’ పథకం పేరుపై టీడీపీ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు. సీఎం జగన్ ని ఉద్దేశించి వర్ల రామయ్య ట్వీట్ చేస్తూ...‘ముఖ్యమంత్రి గారు… మీ ప్రభుత్వం తెలుగును ఖూనీ చేస్తుందా? లేక మిమ్ముల్ని అల్లరి చేస్తుందా?’ అని ప్రశ్నించారు. చేదోడు అంటే సహాయం అనే కాకుండా, చేదువాడు అనే అర్థం కూడా వస్తుందని చెప్పారు. “జగనన్న చేదువాడు” అంటే చెడ్డవాడు అనే అర్థం కూడా వస్తుందని ఎద్దేవా చేశారు.

 

‘ఏమయ్యారు సార్, మీ తెలుగు ప్రపంచ మేధావులు? పేరు మార్చండి’ అని ట్వీట్ చేశారు. దీంతో వైసిపి మీడియా స్పోక్స్ పర్సన్స్ తో వర్ల రామయ్య నుద్దేశించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను కామెంట్లను ఉద్దేశించి...టీడీపీ లో ఆ వ్యక్తి ని కంట్రోల్ చెయ్యడం లేదు ఏంటి అంటూ జగన్ సీరియస్ అయినట్లు వైసీపీ పార్టీలో టాక్. మనం మంచి చేస్తున్నప్పుడు ప్రతిపక్షం విమర్శిస్తున్నపుడు దానికి తగ్గ విధంగా కౌంటర్ ఇయ్యాలని వైసిపి మీడియా స్పోక్స్ పర్సన్ కీ జగన్ ఆదేశించినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: