మందలగిరి చినబాబు కుటుంబ ఆస్తుల ప్రకటన పేరుతో నమ్మలేని నిజాలు చెప్పాడు. విచిత్రమేమిటంటే తాము ప్రకటిస్తున్న ఆస్తులు-అప్పులను జనాలెవరూ నమ్మరన్న విషయం వాళ్ళకి కూడా బాగా తెలుసు. అయినా సరే  దేశం మొత్తం మీద తొమ్మిదేళ్ళుగా ఆస్తులు, అప్పులను ప్రకటిస్తున్న ఏకైక రాజకీయ కుటుంబం తమదే అని తమ జబ్బలు తామే చరుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం కూడా కుటుంబంలోని ఐదుగురు ఆస్తుల వివరాలను లోకేష్ ప్రకటించారు.

 

ఎవరికీ అర్ధంకాని విషయం ఏమిటంటే వీళ్ళాస్తులకు మూల ఆధారం చంద్రబాబునాయుడే అన్న విషయం అందరికీ తెలుసు. బహుశా వివాహం తర్వాత బ్రాహ్మణి రూపంలో చంద్రబాబు కుటుంబానికి ఏమైనా ఆస్తులు కలిసుండవచ్చు. అంతకుముందు ఎప్పుడో అంటే ఏ 40 ఏళ్ళ క్రితం భువనేశ్వరి రూపంలో కూడా ఏమైనా ఆస్తులు చంద్రబాబుకు కలిసుండవచ్చు. భువనేశ్వరి-చంద్రబాబు వివాహం జరిగి దాదాపు 40 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ విషయాలు బయటకు తెలీదు.

 

చంద్రబాబు కుటుంబం  ప్రకటిస్తున్న ఆస్తుల వివరాలు చూస్తే తాత ఆస్తికన్నా మనవడు దేవాన్ష్ కే ఆస్తులు ఎక్కువగా ఉంటున్నాయి.  ప్రత్యర్ధులు చేసే ఆరోపణల ప్రకారం చంద్రబాబు సంపాదించిన అక్రమార్జన ముందు భువనేశ్వరి, బ్రాహ్మణి ద్వారా సంక్రమించిన ఆస్తుల విలువ చాలా తక్కువనే చెప్పాలి.  చంద్రబాబు నికర ఆస్తి రూ. 3.87 కోట్లయితే అప్పులు రూ. 5.13 కోట్లట. అదే దేవాన్ష్ విషయం చూస్తే బుడ్డోడి పేరుతోనే రూ. 19.42 కోట్ల ఆస్తులున్నట్లు లోకేష్ ప్రకటించాడు.

 

చంద్రబాబు కుటుంబనేపధ్యాన్ని చూస్తే యూనివర్సిటిలో చదువుకునేటపుడు ఫీజులను కూడా ఎకనామిక్స్ ప్రొఫెసర్ డిఎల్ నారాయణే కట్టాడని ఇప్పటికీ ఎస్వీ యూనివర్సిటిలో చెప్పుకుంటారు. అంత ఘనమైన ఆర్ధిక నేపధ్యమున్న చంద్రబాబు ఇపుడు అనుభవిస్తున్న ఆస్తులన్నీ తనవి కాదని చెప్పటమే విచిత్రం. పైగా తన జేబులో వంద రూపాయలు కూడా లేవని, తన చేతికి వాచీ, వేలికి ఉంగరం కూడా లేదని బీద మాటలు మాట్లాడితే జనాలు నమ్మేస్తారని అనుకోవటమే విచిత్రంగా ఉంది. ఇంతోటి ఆస్తులు-అప్పుల ప్రకటనను ఎందుకు చేయరంటూ జగన్మోహన్ రెడ్డికి సవాలు విరసరటమే ఆశ్చర్యం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: