ఏపీ సీఎం వైయస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి ఇచ్చిన ప్రతి మాటని ప్రతి హామీని నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సంకల్ప పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మేనిఫెస్టోలో ఉన్న దాన్ని తక్షణమే అమలు అయ్యేవిధంగా ప్రస్తుతం పరిపాలన చేస్తున్నారు జగన్. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీల లో 'అమ్మఒడి' మరియు 'రైతు భరోసా' ఈ రెండు పథకాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. కేవలం రాష్ట్రంలోనే కాక దేశంలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ జగన్ పరిపాలన గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

 

ఇదే తరుణంలో దేశంలోనే మంచి ముఖ్యమంత్రి స్థానంలో మూడవ స్థానాన్ని జగన్ అతి చిన్న వయసులోనే దక్కించుకోవడం తో భవిష్యత్తులో భారతదేశ రాజకీయాలలో దక్షిణాదిలో కీలకమైన రాజకీయ నేతగా జగన్ అవతరించక తప్పదని పెద్ద పెద్ద జాతీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ ప్రకటించిన ఒక పథకానికి రాష్ట్రంలో ఉన్నాయి దివ్యాంగులు అంతా చెయ్యెత్తి జగన్ కి మొక్కుతున్నారు. గొప్ప పని చేశావు జగనన్న మా జీవితాలలో వెలుగు నింపావు అంటూ పథకాన్ని ఉద్దేశించి జగన్ పై పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. అసలు మేటర్ లోకి వెళ్తే జగన్ సర్కార్ తాజాగా గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్స్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

కాగా ప్రస్తుతం వారికి 3 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా, తాజాగా జగన్ సర్కార్ ఒక్క శాతం పెంచి మొత్తం నాలుగు శాతంగా ఖరారు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అంధత్వం, చూపు మందగించడం వంటి సమస్యలు ఉన్నవారికి 1 శాతం, వినికిడి లోపం ఉన్నవారికి 1 శాతం, మస్తిష్క పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, చలన సంబంధ వైకల్యం, కండరాల బలహీనత, మరగుజ్జుతనం, యాసిడ్​ దాడి బాధితులకు 1 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఇక లెర్నింగ్​ డిసెబిలిటీ, ఆటిజం వంటి సమస్యలతో బాధపడేవారికి సైతం 1 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఐదుగురికి మించి సిబ్బంది ఉంటే అక్కడ ప్రమోషన్స్ లోనూ ఇదే తరహాలో రిజర్వేషన్ అమలు చేయాలని జగన్ సర్కార్ ఆదేశించడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: