చంద్రబాబునాయుడు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ దగ్గర దొరికిన డైరీల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అత్యంత ప్రముఖుడు,  రాజ్యసభ ఎంపి అహ్మద్ పటేల్ జాతకం దొరికిందా ? ఇపుడిదే అంశం రాజకీయాలను కుదిపేస్తోంది. ఎక్కడ చూసినా ఇదే విషయమై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.  ఏపి కేంద్రంగా ఐటి అధికారులు ఐదు రోజులపాటు సోదాలు నిర్వహించిన విషయం ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే.

 

సోదాలు ఎవరిపై నిర్వహించారు ? కంపెనీలు ఎవరివి ? ఏమేమి దొరికాయి ? అన్న విషయాలను పక్కనపెడితే సోదాల తర్వాత అందరి దృష్టి పెండ్యాల మీద మాత్రమే కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు దగ్గర పదేళ్ళు పనిచేయటమే. దానికి తగ్గట్లే శ్రీనివాస్ దగ్గర కీలకమైన పత్రాలు, డైరీలు దొరికాయన్నారు. రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికినట్లు ఐటి అధికారులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో స్పష్టంగా ఉంది. కాకపోతే మొత్తం సోదాల్లోనా లేకపోతే పెండ్యాల దగ్గర మాత్రమేనా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

 

సరే ఈ విషయాలను పక్కనపెడితే తాజాగా ఐటి అధికారులు అహ్మద్ పటేల్ కు మూడుసార్లు నోటిసులివ్వటం సంచలనంగా మారింది. రూ. 400 కోట్ల వాహలాకు సంబంధించి తమకు దొరికిన ఆధారాలపై విచారణకు హాజరవ్వాలంటూ అధికారులు పటేల్ కు నోటిసులివ్వటం కలకలం రేపుతోంది.

 

ఎందుకంటే పెండ్యాల దగ్గర దొరికిన డైరీలోని వివరాల ఆధారంగానే ఐటి అధికారులు పటేల్ కు నోటిసులిచ్చారనే ప్రచారం సంచలనంగా మారింది.  అహ్మద్ పటేల్ కు ఎప్పుడో ఇచ్చిన రూ. 400 కోట్లకు శ్రీనివాస్ డైరీలో వివరాలున్నాయంటే మరి కొన్ని నెలల క్రితమే జరిగిన ఉత్తరాధి రాష్ట్రల ఎన్నికల ఖర్చు  మాటేమిటి ? మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయంలో తనకూ భాగస్వామ్యం ఉందని చంద్రబాబు బహిరంగసభలో చెప్పటంలో అర్ధమేంటి ?  పై రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు వందల కోట్లను చంద్రబాబే సర్దబాటు చేశారనే ఆరోపణలు బాగా ఉన్నాయి. మరి ఆ వివరాలు కూడా బయటపడితే ?

మరింత సమాచారం తెలుసుకోండి: