ఇటీవలి కాలంలో స్త్రీపురుషుల మధ్య వివాహేతర సంబంధాల సమస్య ఎక్కువై పోతుంది. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా, వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా. పలు సందర్భాల్లో నేరాలకు కూడా పలు పాడుతున్నారు. అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలేంటి అనే అంశాన్ని పరిశీలిస్తే...

 

భార్యాభర్తలు లేదా స్త్రీ పురుషుల మధ్య సంతృప్తికరమైన దాంపత్య సుఖం లేక పోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పడక గదిలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీ, పురుషులు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే, శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహ్యించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో సెక్స్‌లో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదు. దీంతో పరాయి పురుషుని కోసం వెంపర్లాడడం మొదలవుతుంది.

 

తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడక పోవడం, తాము చెప్పినట్టు నడుచుకోక పోవడం వల్ల  పక్క చూపులు చూస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. వివాహమైన తర్వాత బాగా అలంకరించుకుని పడక గదికి వచ్చే మహిళలు రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం అనేక మంది పురుషులకు పూర్తి నిరాశ కలిగిస్తోంది.

 

అలాగే, పెళ్లికి ముందు తన మనస్సులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణంగా చెపుతున్నారు. వివాహానికి ముందు ఉండే వివాహేతర సంబంధాలు  వివాహం తర్వాత కుడా కొనసాగించాలని మనస్సులో కోరిక కలగడం. వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ, అందుకు తగినట్టు తనకు భర్త గుణగణాలు లేక పోవడం వల్ల తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని తమ కోర్కెలను తీర్చుకునేందుకు ఉబలాటపడుతుంటారు. 

 

ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ కార్యాలయాల్లో పని చేసే సమయంలో ఇతర మహిళలకు పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకోవడం, దాంపత్య జీవితంలో ప్రతి రోజూ కొత్తదనం కోరుకునే స్త్రీ, పురుషులు ఈ తరహా సంబంధాల పట్ల అధిక ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: