టీడీపీ అధినేత తలుచుకుంటే ఎవరి కొంప అయిన సులువుగా ముంచగలరు అనే విషయం తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆయన అవసరాల కోసం ఏ నాయకుడినైనా వాడుకోగలరు. ఆయన రాజకీయ అవసరాల్లో ఆ నేతలు బలి కూడా అయిపోవచ్చు. ఈ విధంగా చంద్రబాబు రాజకీయాలకు చాలామందే బలైపోయారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా ఈయన చెత్త వ్యూహాలకు కొందరు నేతలు భవిష్యత్ శూన్యమయ్యే స్టేజ్‌కు వచ్చింది. అయితే ఆ విషయం అర్ధం చేసుకున్న ఓ నేత మాత్రం తెలివిగా బాబుని వదిలేసి జగన్ చెంతకు చేరారు.

 

కాకపోతే ఆ నేత పార్టీ మారిన తమ్ముడు మారకుండా టీడీపీలోనే ఉండటంతో, ఇప్పుడు అతని పరిస్తితి ఏంటో అర్ధం కాకుండా ఉంది. అలా అన్న వైసీపీలోకి వెళ్ళి, తమ్ముడు టీడీపీలోనే ఉండిపోయిన వారు ఎవరో కాదు. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా బ్రదర్స్. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు బీదా మస్తాన్‌రావుకు తన సొంత నియోజకవర్గం కావలి సీటు ఇవ్వకుండా,  నెల్లూరు పార్లమెంట్ సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. అసలే నెల్లూరు వైసీపీకి కంచుకోట కావడం, పైగా జగన్ గాలి గట్టిగా ఉండటంతో మస్తాన్ దారుణంగా ఓడిపోయారు.

 

ఓడిపోయాక టీడీపీలోనే ఉంటే రాజకీయ భవిష్యత్ కష్టమని భావించి, వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక వైసీపీలోకి వచ్చిన ఆయనకు రేపో మాపో జగన్ రాజ్యసభ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే మస్తాన్ రావు విషయం కాసేపు పక్కనబెట్టేస్తే, అతని బాబాయ్ కుమారుడు బీదా రవిచంద్రాయాదవ్ టీడీపీలోనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా ఉంది.

 

కాకపోతే ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్‌లో టీడీపీకి అభ్యర్ధి లేడు. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, రవిచంద్రాని పార్లమెంట్ బరిలో దింపే అవకాశం లేకపోలేదని జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎలాగో నెల్లూరు వైసీపీకి కంచుకోట కాబట్టి టీడీపీ నుంచి పోటీ చేయడానికి మిగతా వాళ్ళు భయపడటం ఖాయం. దీంతో రవిచంద్రానే పోటీకి దిగే ఛాన్స్ ఉంది. ఇక గెలుపు ఎలాగో వైసీపీదే కాబట్టి, రవిచంద్రా పరిస్తితి కూడా గోవిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: