చైనాలో నిజంగానే కరోనా వైరస్ కేసులు తగ్గాయా...? కొత్తగా ఈ వైరస్‌ బారిన పడే వాళ్ల సంఖ్య గతంతో పోల్చితే తక్కువగా ఉందా...? అధికారిక లెక్కలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కానీ కరోనా వైరస్ కేసుల లెక్కింపు విధానంలో చైనా కొన్ని మార్పులు చేసింది. అందుకే కేసుల్లో కొంత తేడా కనిపిస్తోంది. మరోవైపు ఇతర దేశాల్లోనూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డైమాండ్ ప్రిన్స్‌ నౌకలో ప్రయాణిస్తున్న ఇద్దరు కరోనాతో చనిపోయారు. మరోవైపు దక్షిణ కొరియాలోనూ తొలి కరోనా మరణం నమోదయ్యింది.

 

వారాలు నెలలు గడుస్తున్నా కరోనా మాత్రం  ఇప్పటికీ చైనాను భయపెడుతూనే ఉంది. ఈ వైరస్ భయటపడ్డప్పుడు ఉన్న ఆందోళనకర పరిస్థితులు ఇప్పుడు లేకపోయినా... కరోనా నుంచి చైనా ఇప్పట్లో బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. కొవిడ్‌-19 ప్రభావం హుబెయ్‌, వుహాన్‌లోనే విపరీతంగా ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే 62,031 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా 394 కొత్త కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌  ప్రకటించింది. ఒక రోజులో ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. 

 

అయితే తక్కువ కేసులు నమోదైనట్టు చైనా చెబుతున్న కొన్ని లెక్కలపై ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ కేసుల డేటాను అధికారికంగా ప్రకటించే విషయంలో చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం మాత్రమే తాజాగా కరోనా కేసులను ప్రకటిస్తున్నారు. సీటీ స్కాన్‌లో పాజిటివ్‌గా నమోదైన కేసులను ఓవరాల్‌గా చూపించే డేటాలో కలపడం లేదన్న విమర్శలున్నాయి. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం కరోనాతో చనిపోయిన వారి సంఖ్యలోనూ తేడాలు కనిపిస్తున్నాయి...,అధికారికంగా ఇప్పటి వరకు కొవిడ్ మృతుల సంఖ్య 2118కి పెరిగింది.

 

మరోవైపు జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ప్రయాణించే వారిలో ఇద్దరు కరోనా చనిపోయారు. దీంతో నౌకలో ప్రయాణించే వారిలో టెన్షన్ మొదలైంది. వైరస్ లేదని నిర్ధారించి 443 మందిని నౌక నుంచి బయటకు పంపించారు. చైనా కాకుండా కరోనా మరణాలు ఇతర దేశాల్లోనూ పెరుగుతున్నాయి. ఇరాక్‌లో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో తొలి కరోనా మరణం నమోదయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: