వైయస్ జగన్ ఇటీవల తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో తోట త్రిమూర్తులు పై జరిగిన చెప్పు దాడి గురించి తెలుసుకుని 12 గంటల్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలని పార్టీ నాయకులకు జగన్ ఆదేశించినట్లు సమాచారం. విషయంలోకి వెళితే అధికార పార్టీ వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రశాంతతకు రాష్ట్రంలో మారుపేరైన రెండు గోదావరి జిల్లాలో ఒక జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఈ గొడవలు బయటకు రావటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులను వైసిపి హైకమాండ్ చేర్చుకోవడం ఏ మాత్రం క్షమించ లేకపోతున్నారు ముందు నుండి పార్టీలో ఉంటున్న వాళ్ళు.

 

తాజాగా వైసీపీ పార్టీలో చేరేందుకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మరియు మంత్రి మోపిదేవి తో పాటు కలసి ద్రాక్షారామం వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులకు చేదు అనుభవం ఎదురైంది. వైవీ సుబ్బారెడ్డి ముందే తోట త్రిమూర్తుల పై ఇజ్రాయేల్ అనే వైసిపి నేత చెప్పుతో దాడి చేయడం అక్కడ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో తోట త్రిమూర్తులు అనుచరులు అక్కడే ఉండటంతో వెంటనే ఇజ్రాయేలు అనే అతన్ని అదుపులోకి తీసుకుని పక్కకు కూర్చోపెట్టడం జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అయింది. విషయంలోకి వెళితే ఇజ్రాయేల్ అనే వ్యక్తి ఎవరు అని ఆరా తీయగా అసలు విషయం మొత్తం బయట పడింది. మేటర్ ఏమిటంటే ఇజ్రాయెల్ ది తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం మసకపల్లి. ఇతడు స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన నేత.. తోట త్రిముర్తులు వైసీపీలో చేరితే వైసీపీ ఎమ్మెల్యే వేణు భవిష్యత్తుకు ఇబ్బంది.

 

సో తోట త్రిమూర్తులను వైసీపీలో చేర్చుకోవడానికి చూస్తున్న వైవీ సుబ్బారెడ్డి మంత్రి మోపిదేవి ముందే అతడిపై చెప్పులతో దాడి చేశాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఇజ్రాయిల్ షేర్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్ పెద్ద వైరల్ గా మారి సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ పై తీవ్రమైన వ్యతిరేకమైన కామెంట్లు వస్తున్నాయి. అయితే మరోపక్క మాత్రం తోట త్రిమూర్తులు గతంలో దళితులను కించపరిచే విధంగా మాట్లాడటం తోనే ఆ కోపంతో ఇజ్రాయెల్ చెప్పుతో దాడి చేసినట్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం జగన్ దృష్టికి వెళ్లడంతో గొడవ ఏంటో 12 గంటల్లో నాకు తెలియాలి అని గట్టిగా తూర్పుగోదావరి జిల్లా నేతలను హెచ్చరించినట్లు వైసీపీ పార్టీలో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: