విద్యార్థులు చదివేది పదైన,  ఇంటరైన, డిగ్రీ అయినా... ఇలా ఏదైనా సరే... ఎగ్జామ్స్ వచ్చిందంటే చాలు విద్యార్థులందరికీ అదో పెద్ద టెన్షన్ గా మారిపోతుంది. అయితే అప్పటి వరకు చదవని వాళ్ళు అందరూ... ఎగ్జామ్స్ వచ్చాయి అంటే చాలు.. అబ్బో వాళ్ళ చదువుడు  మామూలుగా ఉండదు. బుక్కులన్నీ ముందు  పెట్టుకుని  తెగ చదివేస్తుంటారు . అయితే అప్పటికప్పుడు  బుక్కులో ఉన్నదంతా బుర్రలోకి ఎక్కాలి అంటే చాలా కష్టమైన పనే కదా... అందుకే ఇక ఎగ్జామ్ హాల్ లో కూర్చొని క్వశ్చన్ పేపర్ రాగానే తెగ కంగారు పడిపోతుంటారు. అరే ఇది మనం చదివిన సబ్జెక్ట్ ఏనా లేక వేరేదా  అని తికమక పడిపోతుంటారు. ఇదే సమయంలో ఎగ్జామ్ హాల్ లో కూర్చున్న వారందరికీ ఒక ఒకే ఒక ఆలోచన తడుతూ ఉంటుంది. 

 


 అదేంటంటే.. ఇన్విజిలేటర్ కొంచెం హెల్ప్ చేస్తే బాగుండు... ఈ పరీక్షను గట్టెక్కించవచ్చు అని ఇన్విజిలేటర్ల వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇన్విజిలేటర్లు కరుణిస్తే కొన్ని కొన్నిసార్లు మాత్రం  రూల్స్  పాటించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఎక్సమ్ రాసిన  వాళ్ళ పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంటుంది. ఏదో సినిమా స్టోరీ  రాసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కేవలం ప్రశ్నపత్రాన్ని ఆన్సర్ పేపర్ లో రాసే వాళ్ళు కూడా చాలామంది. అయితే ఆన్సర్ పేపర్ లో కొన్ని డబ్బులు పెడితే పాస్ చేస్తే బాగుండు అని కూడా చాలామంది విద్యార్థులు అనుకుంటారు. 

 


 అయితే తాజాగా ఇక్కడొక  ఉపాధ్యాయుడు  చెప్పింది  చూస్తే ఆన్సర్ షీట్ లో డబ్బులు పెడితే నిజంగానే పాస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్సర్ షీట్ లో వంద పెడితే విద్యార్థులందరూ పాసవుతారు అంటూ ఒక ఉపాధ్యాయుడు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది. అందరూ చిట్టీలు చూసి రాయండి. ఒకవేళ చిట్టీలు చూసి రాసేటప్పుడు టీచర్ పట్టుకుంటే బ్రతిమలాడండి... ఎగ్జామ్ రాశాక మీ ఆన్సర్ షీట్ లో  వంద రూపాయలు పెడితే మీ షీట్ చూడకుండానే గుడ్డిగా పాస్ చేస్తారు అని ఆ వీడియోలో ఆ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. కాగా విద్యార్థులు తప్పు దారిలో నడవకుండా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడే తప్పు దారిలో నడవాలని తో సూచిస్తుండడంతో... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: