కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. తీసుకున్న అప్పును తీర్చకపోవటంతో అప్పు కోసం ష్యూరిటిగా పెట్టిన ఆస్తులను వేలం వేయటానికి డిసైడ్ అయ్యింది. అప్పుడెప్పుడో బ్యాంకు నుండి సుజనా తీసుకున్న రూ. 322 కోట్ల అప్పు ఇపుడు  వడ్డీతో కలిపి సుమారు రూ. 401 కోట్లకు పెరిగిందని సమాచారం. అప్పు తీర్చే విషయంలో కానీ లేకపోతే వాయిదాలు కట్టేవిషయంలో కానీ సుజనా పెద్దగా పట్టించుకోలేదట.

 

నోటీసుల మీద నోటీసులు ఇచ్చినా సుజనా పట్టించుకోకపోవటంతో వేరే దారిలేక చివరకు ఆస్తుల వేలం నోటిసు ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 23వ తేదీన ఆస్తుల వేలానికి డేట్ కూడా బ్యాంకు ఫిక్స్ చేసింది. మార్చి నెల 20వ తేదీన తనఖాలో ఉన్న ఆస్తులను కొనుగోలుపై ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంగా వచ్చి పరిశీలించుకోవచ్చని, 21వ తేదీన కొనుగోలు చేయదలచుకున్న ధరను ఆన్ లైన్లో బిడ్ వేయాలని బ్యాంకు తన నోటీసులో స్పష్టంగా చెప్పింది.

 

బ్యాంకు నుండి అప్పు తీసుకునేటపుడు సుజనా 7700 గజాల స్ధలాన్ని తనఖాగా పెట్టినట్లు బ్యాంకు చెప్పింది.  సరే అప్పులు తీసుకోవటం, ఎగ్గొటడం అన్నది సుజనాకు కొత్తేమీ కాదని వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్నదే. గతంలో మారిషస్ బ్యాంకు నుండి కూడా సుమారు 100 కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఎగ్గొట్టిన చరిత్ర సుజనాకుంది. ఇదే విషయమై బ్యాంకు కోర్టులో కేసు వేసింది. విచారణకు సుజనా హాజరుకాకపోవటంతో చివరకు నాంపల్లి బ్యాంకు సుజనాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

మొత్తానికి ఆ కేసు ఏమైందో ఇపుడెవరికీ తెలీదు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుజనా ఆస్తుల వేలానికి నోటీసులు ఇవ్వటంతో మళ్ళీ సుజనా బ్యాంకు మోసాల విషయం చర్చకు వచ్చింది. గతంలోనే బ్యాంకులను మోసం చేసిన ఘటనలపై ఇప్పటికే సుజనాపై 3 ఎఫ్ఐఆర్ లున్నాయి. డొల్ల కంపెనీలతో పాటు ఆర్ధిక అక్రమాలపై సుజనాపై ఇప్పటికే సిబిఐ, ఐటి, ఈడి సోదాలు కూడా నిర్వహించి కేసులు కూడా పెట్టాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: