జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు . తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక సంచలన నిర్ణయం తీసుకుని .. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు . ఉద్యోగావకాశాల్లోనే కాకుండా , ప్రమోషన్ల లో కూడా దివ్యంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది .  ప్రభుత్వం విడుదల చేసే ప్రతి ఉద్యోగ  నోటిఫికేషన్ లోను  దివ్యంగులకు నాలుగు శాతం ఉద్యోగావకాశాలను కల్పిస్తూ , ఈ నెల 19 వతేదీన ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది .

 

గతంలో ఏ ప్రభుత్వం కూడా దివ్యంగుల మేలు కోసం ఈ తరహా నిర్ణయం తీసుకోలేదు . కానీ జగన్ సర్కార్ మాత్రం దివ్యంగుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడం పట్ల వారు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు .  ప్రభుత్వ సంస్థలు ఇచ్చే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ లో నాలుగు శాతానికి మించకుండా దివ్యంగులకు రిజర్వేషన్లు కల్పించాలి . బెంచ్ మార్క్ డీసెబిలిటీస్ కారణంగా వారికి ఒక శాతం రిజర్వేషన్ లభించనుంది . ఒక క్యాలెండర్ ఇయర్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన  ఒక ఉద్యోగానికి అర్హులైన దివ్యంగులు లభించకపోతే , ఆ ఉద్యోగ భర్తీని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలి కానీ దొరకలేదన్న కారణంగా ఇతరుల్ని నియమించరాదంటూ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు .

 

దీనితో దివ్యంగులకు కేటాయించిన ఉద్యోగావకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వారికే ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టం అవుతోంది . ఒకవేళ మహిళా దివ్యంగురాలికి ఉద్యోగాన్ని రిజర్వ్ చేస్తే , ఆ అర్హతలున్నా మహిళా దివ్యంగులు లభించకపోతే మాత్రం , పురుషులతో ఆ స్థానాన్ని భర్తీ చేసే వెసులుబాటు ను కల్పించారు .  ఒకవేళ దివ్యంగులు పని చేయలేని ఉద్యోగం అయితే దానికి ఇంటర్ డిపార్ట్ మెంట్ కమిటీ ఆమోదం మేరకు రిజర్వేషన్లు ఎత్తివేయవచ్చునని వెల్లడించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: