పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్.. రాజకీయాల్లో పవర్ లెస్ స్టార్.. సినీ కెరీర్ బాగా నడుస్తున్న సమయంలో రాజకీయాలలో ఏదో సాధించాలని వెళ్ళాడు.. అప్పటికి అభిమానులు అంత చెప్తున్నారు.. అన్న మన మెగా కుటుంబానికి రాజకీయాలు అచ్చు రాలేదు.. సినిమాలే ముద్దు అని.. 

 

కానీ పవన్ కళ్యాణ్ విన్నాడా? వినలేదు? ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం కూడా అంత అద్భుతంగా జరగలేదు అని అంటారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అని.. 2019 ఎన్నికలు వచ్చే సమయానికి ఆ నిర్ణయాన్ని కూడా అలాగే స్థిరంగా లేడు అని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇటీవలే తన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో కూడా ప్రకటించేశారు. అది ఎం అని అంటే? ''సమాజం కోసం ఏదో ఒకటి తన వంతుగా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసిన విధానం నచ్చక.. ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టానని'' పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

 

అయితే ప్రజలకు మంచి చెయ్యడం అనేది.. రాజకీయ మార్పు గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ ను.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను గూగుల్ ఘోరంగా అవమానించింది.. పవన్ కళ్యాణ్ ఎవరు అని కొడితే.. సినీ నటుడు అని, డైరెక్టర్ అని, స్క్రీన్ రైటర్ అని, ప్లే బ్యాక్ సింగర్ అని, కొరియోగ్రాఫర్ అని చూపిస్తుంది.. ఇంకా అతనికి ముగ్గురు భార్యలు అనేది చూపిస్తుంది.. అవి అన్ని చుపించాకా చివరికి పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ నాయకుడు అని చూపించింది గూగుల్. 

 

అంటే గూగుల్ కు కూడా అర్థం అయిపోయింది.. పవన్ కళ్యాణ్ ఒక నటుడే తప్ప పెద్ద రాజకీయ నాయకుడు కాదు అని.. అందుకే అది కూడా ఆలా చూపించింది అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేధికగా సెటైర్లు వేస్తే కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: