ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన కీలక ఆర్డినెన్స్ ను జారీ చేసింది. పంచాయతీ రాజ్ చట్టంలో కీలక మార్పులు చేయటంతో పాటు కేబినేట్ ఆ మార్పులకు ఆమోదం తెలపడంతో ఆర్డినెన్స్ కు అనుమతి లభించింది. సీఎం జగన్ పంచాయతీరాజ్ ఎన్నికలను డబ్బు, మద్యం ప్రభావం లేకుండా నిర్వహించేందుకు ఈ చట్టం తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. 
 
ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ప్రోరోగ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించనుంది. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ వలన రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ వలన ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. 
 
ఎవరైనా అభ్యర్థులు మద్యం,డబ్బుతో పట్టుబడితే ఆ అభ్యర్థులకు మూడేళ్ల కఠిన శిక్షతో పాటు వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు. అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, 10000 రూపాయలు జరిమానా విధించే విధంగా చట్టంలో మార్పులు చేశారు. కేబినేట్ పంచాయతీ ఎన్నికలలో ప్రచార గడువు 5 రోజులుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచార గడువు 7 రోజులుగా నిర్ణయిస్తూ ఆమోదం తెలిపింది. 
 
వైసీపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలో చేసిన మార్పుల వలన తెలుగుదేశం పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే విజయం సాధించగల సత్తా సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం రాష్ట్రంలో రోజురోజుకు బలహీనపడుతోంది. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి టీడీపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా చేసిందని రాజకీయ విశ్లేషకుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: