పిల్లలకు విద్యాబుద్దులు నేర్పవలసిన గురువులు ఈ మధ్యకాలంలో ఎన్నో చండాలపు పనులు చేస్తున్నారు.. విద్యార్ధినులతో అసహ్యంగా ప్రవర్తించడమే కాదు. పవిత్రమైన వారి వృత్తికి తీరని అన్యాయం చేస్తున్నారు.. ఇదే కాకుండా మరికొందరు స్కూల్ పిల్లలను వారి పర్సనల్ పనులకు ఉపయోగించుకోవడం చేస్తున్న విషయం తెలిసిందే... పిల్లలకు పాఠాలు చెప్పమంటే ఇలాంటి పనికిమాలిన పనులతో విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు..

 

 

ఇక తాజాగా ఓ గురుకుల పాఠశాలలో పాఠాలు చెప్పవలసిన టీచర్లు సమయాన్ని టిక్‌టాక్‌లతో వృధా చేస్తున్నారు.. ఇలాంటి వారు ఎన్ని రోజులు దాగుతారు అందుకే బండారం బయటపడగా వీరి ఉద్యోగాలు ఊడాయి.. ఇకపోతే నేటి కాలంలో టిక్ టాక్ ఈ యాప్ లేని మొబైల్ ఫోన్ లేదు అంటే వినడానికి ఆశ్చర్యమేస్తుంది.. ఇక ఈ పిచ్చి  మరీ ముఖ్యంగా యూత్‌లో నరనరాల్లోకి ఎక్కేసింది. దీంతో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన టిక్‌ టాక్‌ యాప్‌ను పలు రాష్ట్రాలు నిషేధించే పనిలో కూడా పడ్డాయి.

 

 

ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం గురుకుల పాఠశాలలో పిల్లలకు బోధన చేయవలసిన ముగ్గురు కాంట్రాక్ట్ టీచర్లు కొన్ని రోజులుగా స్కూల్లో టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. తాము చేయడమే గాక విద్యార్థులతో కూడా వీడియోలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులతో రొట్టెలు చేయించడం, విద్యార్థినులతో సినిమాల్లోని డైలాగ్‌లు చెప్పించడం, పాటలు పాడించడం వంటివి చేయించి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోలు కాస్త వైరల్ కావడంతో వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. .

 

 

వారు ఊరుకుంటారా.. వెంటనే గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ బుర్హాన్ రామవరం గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టగా, స్కూల్‌లో టిక్ టాక్ వీడియో చిత్రీకరించిన విషయం నిజమేనని తేలింది... దీంతో కలెక్టర్ ఎంవీ రెడ్డి సైతం వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు గురుకులాలను బలోపేతం చేసే దిశగా ప్రక్షాళన చేస్తుంటే.. ఇలా కొందరు టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇక ఇలాగే ఇప్పటివరకు చాలమంది టిక్ టాక్ మోజులో పడి తమ ఉద్యోగాలు ఊడగొట్టుకున్నారు అయినా కూడా ఇలాంటి వారిలో మార్పు ఏం కలగడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: