ఒకప్పుడు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే  సినిమా కు వెళ్లేవారు లేదా మైదానంలో ఆడుకునేవారు... ఇప్పుడు మాత్రం ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే అర చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు... జనాలని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సరికొత్త యాప్స్  తెరమీదికి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో చిత్రవిచిత్రమైన యాప్స్  స్మార్ట్ఫోన్లో అందరికీ అందుబాటులో ఉండి  ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. ఒక్కొక్క  యాప్ ఒక్కొక్క రీతిలో ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశ వ్యాప్తంగానే  కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జనాలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నది  టిక్  టాక్ . ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది ఈ యాప్. ఇప్పటి వరకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ యాప్  ఏది రాకపోవడంతో దీనికి ఒక సారి గా ఆకర్షితులవుతున్నారు జనాలు. 

 

 

 ఇక ఈ టిక్ టాక్ ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతకుమించి చెడు జరుగుతుంది అని అంటున్నారు జనాలు. ఎందుకంటే మాయదారి పబ్జి గేమ్ ను  సైతం మైమరిపించే లాగా జనాలను ప్రభావితం చేసింది. ఇక టిక్ టాక్ ఒకసారి ఓపెన్ చేశామంటే సమయమే తెలియదు.  ఎందుకంటే టిక్ టాక్ ను ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు యూస్ చేస్తుండడంతో ఇందులో చిత్రవిచిత్రమైన వీడియోలు సరికొత్త ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా నెటిజన్లను అలరిస్తున్నాయి. దీంతో టిక్ టాక్ ఒకసారి ఓపెన్ చేసాక క్లోజ్ చేయాలి అంటే మనసొప్పదు. పిల్లల నుంచి పెద్దల వరకు వయసు తేడా లేకుండా టిక్టాక్ ప్రపంచంలో మునిగితేలుతున్నారు . ముఖ్యంగా చదువుకునే పిల్లలు అయితే టిక్ టాక్ మోజులో పడి చదువును పాడు చేసుకుంటున్నారు. 

 

 

 దీంతో తల్లిదండ్రులు దిగులు పడాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది. టిక్ టాక్ పిచ్చిలో పడి చిన్నారులు చదువులను అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా టిక్ టాక్ లో దీనికి విరుగుడు లభించినట్లయింది. తాజాగా వచ్చిన ఫ్యామిలీ సేఫ్టీ మోడ్  ఫీచర్తో టిక్ టాక్ వ్యసనాన్ని అదుపులో ఉంచవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ యూకే లో అందుబాటులో ఉంది. తద్వారా పిల్లలు ఎంత సేపు టిక్ టాక్ చూడవచ్చు అని తల్లిదండ్రులు టైం సెట్ చేయొచ్చు. దీని కోసం తల్లిదండ్రులు ఒక టిక్ టాక్ అకౌంట్ క్రియేట్ చేసి తమ పిల్లల అకౌంట్ లింక్  చేస్తే ఆ తర్వాత తల్లిదండ్రులు సెట్ చేసిన టైం అయిపోయాక యాప్  పని చేయదు.  కాగా త్వరలో ఈ ఫీచర్ ఇండియాలో కి కూడా అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: