ఈ మద్య దేశంలో ఎక్కడ చూసినా ఆడవారిపై జరుగుతున్న అమానుష చర్యలు, అత్యాచారాలు, హత్యలతో భయాందోళనకు గురి అవుతున్నారు.  ప్రతిరోజూ చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.  ఇటీవల దిశ కేసులో నలుగురు నింధితులు ఎన్ కౌంటర్ అయ్యారు.. త్వరలో నిర్భయ నింధితులకు ఉరిశిక్ష.  తెలంగాణలో రెండు ఘటనల్లో నింధితులకు ఉరిశిక్ష విధించిన తెలిసిందే.  ఆడవారిపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు లైంగిక వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు.  మరి దౌర్భాగ్యం ఏంటేంటే విద్యార్థులపై కూడా ఈ మద్య కొంతమంది ఉపాధ్యాయులు లైంగిక వేధింపులు, అత్యాచారాలు కొనసాగిస్తున్నారు.  

 

విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి వారి బంగారు భవిష్యత్ కి పునాధులు వేయాల్సినవారు నిజమైన వక్రబుద్దితో వ్యవహరిస్తున్నారు.  తాజాగా బాత్ రూమ్ లో  ఉన్న విద్యార్థినిని సెల్‌ఫోన్‌  ద్వారా వీడియో తీసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- మద్రాస్‌ (ఐఐటీఎం) ఆచార్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. హాస్టల్ లో ఉంటున్న ఓ విద్యార్థిని ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు.  కాలేజ్ లో ఉన్న ఉమెన్ బాత్ రూమ్ లో కి వెళినపుడు అక్కడ గోడకు ఉన్న రంద్రం నుంచి ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు ఆమె గమనించింది.  అంతే వెంటనే బయటకు వచ్చి దగ్గరలో ఉన్న సిబ్బందికి తెలిపింది.

 

వెంటనే వారు అక్కడకు వెళ్లి అతను ఉన్న బాత్ రూమ్ కి తాళం వేశారు. తోటి విద్యార్థినుల సాయంతో తాళం తీసి లోపలికి వెళ్లగా.. అక్కడ అదే విభాగంలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ శుభం బెనర్జీ ఉన్నాడు. కోట్టూంపురం పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఎంటెక్‌ పూర్తి చేసిన శుభం బెనర్జీ.. ఐఐటీఎం  హాస్టల్ లో  ఉంటూ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.  అయితే ఓ ఉన్నతమైన గురువు స్థానంలో ఉండి ఇలాంటి వక్రబుద్దితో వ్యవహరించిన ఇతనికి కఠిన శిక్ష పడాలని విద్యార్థులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: