ప్రస్తుతం చైనా దేశంలో విలయ తాండవం చేస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణభయంతో వణికిస్తున్న  ప్రాణాంతకమైన మహామారి కరోనా వైరస్. ప్రస్తుతం కరోనా  వైరస్ సోకి రోజురోజుకు చైనాలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రాణాంతకమైన వైరస్కు సరైన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో ఈ వైరస్ సోకితే ప్రాణాలు పోవడం ఖాయం గా మారింది. దీనితో చైనా ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే పదిహేడు వందల మందికి పైగా ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 70 వేలకు పైగా ప్రజలు ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే అధికారికంగా కేవలం 1700 మంది చనిపోయినప్పటికీ... అనధికారికంగా మాత్రం ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 దీంతో చైనా దేశం మొత్తం స్వీయ  దిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. అయితే అటు వైద్యులు కూడా నిరంతరం కరోనా వైరస్ సోకిన బాధితులందరికీ వైద్య చికిత్సలు అందించడం లో నిమగ్నమై పోయారు. అటు  శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి విరుగుడు కనిపెట్టే పనిలో పడ్డారు. ఇక శరవేగంగా చైనా దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతకమైన వైరస్ చైనా ప్రజలందరూ బెంబేలెత్తుతున్నారు. ఇక  ప్రపంచ దేశాలలో పలు దేశాలకు కూడా ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందడంతో ఆయా దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

 

 

 ఇకపోతే ప్రపంచాన్ని ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్ ను  ఓ చిన్నారి జయించింది. చైనాకు చెందిన నాలుగు నెలల శిశువులో ప్రాణాంతకమైన కరోనా  వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ నాలుగు నెలల చిన్నారి ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఆ శిశువుకు వైద్యం అందించారు. ఇక తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆ చిన్నారికి కరోనా  వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఆ చిన్నారిని... కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 18254 మంది ఈ వైరస్ బారినుండి  కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: