మాజీ మంత్రి, మాజీ ఎంపి, జగన్మోహన్ రెడ్డి బాబాయ్  వైఎస్ వివేకానందరెడ్డి హత్య విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా హై కోర్టులో జరిగిన వాదనల్లో  వివేకా హత్య వెనుక ఐదుగురు  ప్రముఖులున్నట్లు ఆయన కుటుంబసభ్యల తరపున లాయర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.  వివేకానంద హత్య బయటపడినప్పటి నుండి అనేక ఘటనలు సంచలనంగానే ఉంటున్నాయి. వివేకా అంటే ఏదో మామూలు వ్యక్తి కాకపోవటంతో పాటు సరిగ్గా ఎన్నికలకు ముందు జరగటంతో ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

 

ఎలాగూ ఎన్నికలకు ముందు జరిగిన హత్య కాబట్టి సహజంగానే రాజకీయ లబ్దికి లేదా రాజకీయంగా ప్రత్యర్ధులను ఇరుకున పెట్టటానికి ప్రధాన పార్టీలైన తెలుగుదేశంపార్టీ, వైసిపిలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి.  ఈ కేసు విచారణ కోర్టులో అనేక మలుపులు తిరుగుతూ చివరకు హత్య వెనుక ఐదుగురు ప్రముఖులు ఉన్నారని ఆరోపణలు చేసేదాకా వచ్చింది. ఇక్కడ ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యమంటే ఎవరై ఉండచ్చు ? అనే విషయమై ఇపుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

 

హత్య జరిగిన వెంటనే వైసిపి నేతలు చేసిన ఆరోపణల ప్రకారమైతే అప్పట్లో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి తదితరులున్నారు. అదే విధంగా టిడిపి నేతలు చేసిన ఆరోపణల ప్రకారమైతే వైసిపిలోని వైఎస్ కుటుంబసభ్యులే హత్యకు ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపి అవినాష్ రెడ్డి, అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి తదితరులున్నారని టిడిపి నేతలు ఆరోపించారు.  

                                                                                                             

సరే ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలాగున్నా టిడిపి అధికారంలో ఉన్నపుడు జగన్ అండ్ కో  సిబిఐ విచారణ కోరినపుడు చంద్రబాబు ఒప్పుకోలేదు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సిబిఐ విచారణ కోరుతూ చంద్రబాబు అండ్ కో చేస్తున్న డిమాండ్ ను వైసిపి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కాకపోతే వివేకా కూతురు సిబిఐ విచారణ కోరుతూ కోర్టులో కేసు వేయటమే సంచలనంగా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: