ఈ మధ్యకాలంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇక చిన్న చిన్న వివాదానికే ఒకరికి ఒకరు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. కొడుకు పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు అని తండ్రి మందలించాడు. దీంతో కొడుకు తండ్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక కొడుకు తీరును రోజు కళ్ళారా చూస్తున్న తల్లి మనస్తాపానికి లోనయ్యింది . ఇక కొడుకు తీరుతో విసిగిపోయి మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది తల్లి. దీంతో ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది. 

 

 

 మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామంలోని చిత్ర పురం కాలనీలో నివాసముంటున్న పేట పెంటయ్య మౌనిక దంపతులకు ఓ కొడుకు కూతురు ఉన్నారు. పెంటయ్య డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పెంటయ్య ఒకడే పని చేయడం ద్వారా వస్తున్నా సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో కొడుకు కూడా ఏదైనా పని చేస్తే కాస్త చేదోడువాదోడుగా ఉంటాడు  అనుకునేవాడు పెంటయ్య. కానీ కొడుకు మాత్రం ఇంటి పరిస్థితి పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే తండ్రి పెంటయ్య ఎంతో ఆవేదన చెందేవాడు.. 

 

 

 ఇక తాజాగా ఇదే విషయంపై తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. జులాయిగా  తిరగడం కంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటూ తండ్రీ.. కొడుకును  మందలించాడు. ఈ క్రమంలో మాటలు కాస్తా ఘర్షణకు దారి తీసాయి. ఇక ఈ గొడవతో తల్లి మౌనిక తీవ్ర మనస్తాపానికి లోనైంది. తాము ఉంటున్న భవనం 6 వ అంతస్తు కి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే  చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. మౌనిక మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: