తెలంగాణాలో సంచలనం రేపిన వందల కోట్లరూపాయల  ఇఎస్ఐ స్కాం ఇపుడు ఏపిలో కూడా కలకలం రేపుతోందా ? తాజాగా బయటపడిన వివరాల ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంటు అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటపడినట్లు సమాచారం. ఇఎస్ఐ ఆసుపత్రుల వ్యవహారం ఇంకా విభజన జరగలేదు.

 

ఈ నేపధ్యంలోనే పోయిన సంవత్సరం తెలంగాణాలో బయటపడిన వందల కోట్ల రూపాయల స్కాం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసింది. ఇఎస్ఐ డైరెక్టర్ తో పాటు అనేకమంది ఉన్నతాధికారులు ప్రస్తుతం  జైలు ఊచలు లెక్కిస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్లరూపాయల స్కాం బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. సరే ఆ విషయంలో ప్రస్తుతం ఏమి జరుగుతోందో ఎవరికీ గుర్తులేదనుకోండి అది వేరే సంగతి.

 

అయితే హఠాత్తుగా ఏపిలో కూడా ఇటువంటి స్కామే బయటపడినట్లు సమాచారం. గడచిన ఐదేళ్ళల్లో లేని కంపెనీల నుండి మందుల కోనుగోలు ఆర్డర్లు వచ్చినట్లు చూపించటం, లేని కంపెనీల నుండి మందులు కొన్నట్లు తప్పుడు బిల్లులు చూపించటం, ఆర్డర్లను కూడా టెండర్ల  పద్దతిలో కాకుండా నామినేషన్ పద్దతిపై ఇచ్చేయటం, తప్పుడు ఇన్వాయిస్ లు చూపించటం లాంటి అనేక అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంటు అధికారులు గుర్తించారు. ఈ  మొత్తానికి అచ్చెన్న ఇచ్చిన ఆదేశాలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 ఈ మొత్తంలో అప్పటి కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడిదే ప్రధాన పాత్ర అనే అరోపణలు మొదలయ్యాయి. అచ్చెన్నపై ఆరోపణలు కొత్తేమీ కాదు. ఆయన మంత్రిగా ఉన్నపుడే ఆరోపణలు వినిపించినా ఎందువల్లే అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ తాజాగా వెలుగు చూసిన వివరాలతో అచ్చెన్న కేసులో తగులుకోవటం ఖాయమనే అనిపిస్తోంది. ప్రస్తుతానికి ముగ్గురు  ఇఎస్ఐ డైరెక్టర్లను బాధ్యులుగా చూపిస్తున్నా ముందు ముందు అచ్చెన్న దాకా కేసు రాకుండా పోతుందా ? ఎలాగూ అచ్చెన్న మీదకు కేసు వచ్చిన రాజకీయంగా కక్షసాధింపులంటూ గోల మొదలుపెట్టటానికి చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు పచ్చమీడియా కూడా రెడీగా ఉంటుంది లేండి. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: