తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన తరహాలోనే ఏపీలో భారీ ఈఎస్‌ఐ స్కామ్ వెలుగు చూసింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గత ఆరు సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. వందల కోట్ల రూపాయల నకిలీ బిల్లులు రవికుమార్, విజయ్, రమేష్ అనే ముగ్గురు డైరెక్టర్ల హయాంలో బయటపడినట్టు గుర్తించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు కంపెనీలకు ఇచ్చినట్టు తేలింది. 
 
అధికారులు గడచిన ఆరు సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ దందా వలన 404 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు గుర్తించారు. నకిలీ కొటేషన్లతో వాస్తవ ధర కంటే 132 శాతం అధిక ధరకు కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. సీనియర్ అసిస్టెంట్లు, జాయింట్ డైరెక్టర్లు, ఫార్మాసిస్టులు ఈ ముగ్గురు డైరెక్టర్లకు సహకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఈ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు టెండర్లను నామినేషన్ పద్ధతిలోనే ఇచ్చారని నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారులు అచ్చెన్నాయుడి పాత్ర ఉందని నివేదికలో పేర్కొనడం కలకలం రేపుతోంది. మెడికల్స్, ల్యాబ్ కిట్లను నామినేషన్ల పద్ధతిలో పూర్తిగా అందజేయాలని కోరుతూ డైరెక్టర్ రవికుమార్ కు అప్పట్లో అచ్చెన్నాయుడు లేఖర్ రాశారు. 
 
అచ్చెన్నాయుడు ఎటువంటి కొటేషన్ లేకుండా నామినేషన్ పద్దతిలో టెలీ హెల్త్ సర్వీసెస్ కు ఇచ్చినట్టు అధికారులు తేల్చారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖా మంత్రిగా పని చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడిపై ఆరోపణలు రావడంతో చంద్రబాబుకు మరో కొత్త తలనొప్పి మొదలైనట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణం కావడం, మరికొందరు నేతల పేర్లు ఈ స్కామ్ లో బయటకు వచ్చే అవకాశాలు ఉండటం చంద్రబాబుకు షాక్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: