తెలంగాణలో బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న భారీ బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు హాజరు కాబోతున్నారు అని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఈ సంధర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. సీఏ ఏ కు వ్యతిరేకంగా తెలంగాణలో టిఆర్ఎస్, మస్లిజ్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని, దీనిపైన ప్రజల్లోనూ అనేక అనుమానాలు ఉన్నాయని బిజెపి భావిస్తోంది. అందుకే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని బీజేపీ భావిస్తోంది. 

 

దేశంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని బిజెపి ఈ సభ ద్వారా చెప్పుకోవాలని చూస్తోంది. జాతీయ స్థాయి నాయకులు అందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నారు. వీరితోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు హాజరవుతారని బిజెపి ప్రకటించగా ఇప్పుడు పవన్ రాకపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొంతకాలంగా బిజెపి వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు పవన్. అయితే రెండు రోజుల క్రితం కర్నూలు లో జరిగిన ర్యాలీలో బిజెపి, జనసేన కలిపి పాల్గొన్నాయి. అయితే తెలంగాణలో బిజెపి నిర్వహిస్తున్న సభకు వెళ్లేందుకు పవన్ కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.


 ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ తో పవన్ కు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ సభలో పాల్గొంటే ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. సీఏఎ కు మద్దతుగా మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ పైన విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం సినిమాల్లో నటుస్తున్నాను కాబట్టి  తన సినిమాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అనే అనుమానంతో పవన్ ఉన్నారు. అందుకే ఈ సభలో పాల్గొనే విషయమై ఆయన కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తప్పనిసరై ఈ సభలో పాల్గొన్నా కేసీఆర్ ను విమర్శించే విషయంలో మౌనంగా ఉండాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: