దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ విద్యా సంస్థ‌ల్లో ఒక‌టి అయిన చెన్నై ఐఐటీలో అమ్మాయిల అశ్లీల వీడియోల వార్త‌లు దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. చెన్నై కోట్టూరుపురంలోని ఐఐటీలో అశ్లీల చిత్రాలు ఒక్క‌సారిగా అంద‌రిని షాక్‌కు గురి చేశాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క విద్యా సంస్థ కావడంతో ఇక్క‌డ సెక్యూరిటీ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇక ఐఐటీ ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన పరిశోధన గదులు ఉన్నాయి.

 

ఈ గ‌దుల్లో విద్యార్థులు, విద్యార్థినిల‌కు వేర్వేరుగా టాయ్ లెట్ సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. ఇక రెండు రోజుల క్రితం ఓ విద్యార్థిని ప‌రిధోధ‌న చేస్తోన్న టైంలో టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే ఆమె వెళ్లిన టాయ్‌లెట్ గ‌దిలోకి ఓ చిన్న వెలుతురు రావ‌డంతో ఆమె షాక్‌కు గురైంది. ఆ వెలుతురు ఎక్క‌డ నుంచి వ‌స్తుందో ?  ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూడ‌గా ఆమె మైండ్ బ్లాక్ అయ్యింది.

 

టాయ్‌లెట్ బ‌య‌ట ఉన్న నీటి కొళాయిలో స‌న్న‌టి మార్గం నుంచి ఏవరో లోప‌ల జ‌రిగే తంతును వీడియో తీస్తున్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కేక‌లు వేసింది. ఆమె కేక‌లు విన్న విద్యార్థులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నారు. మ‌రో దారుణ‌మైన విష‌యం ఏంటంటే ఆ వీడియోలు తీసేది ఎవ‌రో కాదు ఐఐటీలో ప‌ని చేస్తోన్న ప్రొఫెస‌ర్ సుభంబెనర్జి.

 

వెంట‌నే విద్యార్థుల‌తో పాటు ఐఐటీ సిబ్బంది సుభం బెన‌ర్జీ ఫోన్ తీసుకుని చెక్‌ చేయగా అందులో విద్యార్థినుల అసభ్య చిత్రాలు నమోదై ఉన్నాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అత‌డి ఫోన్లో కొన్ని నెల‌ల నుంచి వీడియోలు తీస్తున్న‌ట్టు స‌మాచారం ఉంది. సాక్షాత్తూ ప్రొఫెస‌రే ఈ నీచ‌మైన ప‌ని చేస్తుండ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: