అధికారపార్టీ నేతలపై  తెలుగుదేశంపార్టీ నేతలు, కార్యకర్తల అక్కసు తీరినట్లు లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు నేతలెవరూ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందుకు చిలకలూరిపేట ఎంఎల్ఏ విడదల రజని కారుపై జరిగిన దాడే తాజా సాక్ష్యం. మహా శివరాత్రి సందర్భంగా  రజని గురువారం రాత్రి కోటప్పకొండలో ప్రభను వదిలి తిరిగి వస్తుండగా హఠాత్తుగా కొందరు కారును అడ్డగించి ధ్వంసం చేసేశారు.

 

అయితే విషయం ఏమిటంటే అందులో ఎంఎల్ఏ లేరు. ఆమె కారులో ఎంఎల్ఏ భర్త కుమార్, మరిది గోపితో పాటు మరో ముగ్గురు బంధువులున్నారు. ఎంఎల్ఏల టార్గెట్ గా దాడి జరిగినా  అందులో ఆమె లేకపోవటంతో ఆ కోపం కారులోని వారితో పాటు కారును ధ్వంసం చేయటంపై చూపారు. గురువారం అర్ధరాత్రి తరువాత ఎదురైన ఘటనతో అందులోని వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 

అయితే ఎంఎల్ఏ వెనక వస్తున్న మరో కారు దగ్గరకు రావటంతో దాడిచేసిన వారంతా పారిపోయారు. అంతా బాగానే ఉంది కానీ దాడి జరిగినపుడు కారులో ఎంఎల్ఏ ఉండుంటే ఆమె పరిస్ధితి ఏమిటి ? పైగా కర్రలు, రాళ్ళతో దాడి జరిగినట్లు గోపి చెప్పటం చూస్తుంటే ఆ సమయంలో కారులో ఎంఎల్ఏ లేకపోవటమే ఆదృష్టమనే అనుకోవాలి.

 

ఇదే విషయమై రజని మాట్లాడుతూ తనను చంపటమే టార్గెట్ గా టిడిపి గుండాలు తన కారుపై దాడి చేసినట్లు మండిపడ్డారు. 200 మంది ఒకేసారి కర్రలు, రాళ్ళు, ఇనుప రాడ్లు తీసుకుని కారుపై దాడి చేయటమేంటని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటి చేసిన ప్రత్తిపాటి పుల్లారావు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఎంఎల్ఏ అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు మాచెర్ల జాతీయ రహదారిపై మరో వైసిపి ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరగటం ఇపుడు రజనిపై దాడి. అంటే వైసిపి ఎంఎల్ఏలపై టిడిపి ఎంతగా మండిపోతోందో అర్ధమైపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: