ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో లో సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించినప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అమరావతి ప్రాంత ప్రజలు రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలనిఅది కూడా అమరావతి అయి ఉండాలంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రైతులు ఆందోళన చేయబట్టి ఇప్పటికే రెండు నెలలు దాటినా విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు.

 

అయితే ఇప్పటికే పోలీసులకు మరియు ఆందోళనకారుల మధ్య అనేక సార్లు వాదోపవాదాలు జరిగాయి. తాజాగా మరో సారి ఇప్పుడు మందడం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అందుకని ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయా లేదా నిరసనలు జరుగుతున్నాయేమో అని చూసేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తుండగా సమయంలో ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలలుగా నిరసనలను పోలీసు వారు కెమెరాతో షూట్ చేస్తున్నారు కానీ పల్లెల్లో గుడిసెలలో మరియు వారి బాత్రూంలకు పైకప్పు ఉండదని మహిళలు స్నానం చేస్తుంటే మీరు ఎలా డ్రోన్ కెమెరాలను తిప్పుతారని రైతులు పోలీసు వారిని అడిగారు.

 

చాలా సార్లు చెప్పినా కానీ పోలీసులు ఇదే రకంగా కెమెరాలను తిప్పుతుండడంతో ప్రజలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు మా పైనే దాడి చేస్తారా అంటూ ఖాకీల క్రౌర్యం చూపించగా కొంత మంది రైతులను అదుపులోనికి తీసుకున్నారు. మా ఆడవాళ్ళను అవమానించి మళ్లీ మిమ్మల్నే అరెస్టు చేస్తారా అంటూ మిగతా రైతులు పోలీసుల్ని అడ్డుకోగా.. దాంతో మరింత రెచ్చిపోయిన పోలీసులు రైతులపై తిరగబడ్డారు.

 

దీంతో రైతులు కర్రలతో పోలీసులపైకి తిరగబడ్డారు దీంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరగటంతో మందడం లో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై రాజధాని ప్రాంత ప్రజలు మాత్రం ... పోలీసులు తమపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదో ఒక సాకుతో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని.. మహిళలు అని కూడా చూడకుండా కొడుతున్నారని.. గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: