దగ్గు వచ్చిందంటే చాలు.. టానిక్‌ను చటుక్కున మింగేస్తాం. ప్రతి ఇంట్లో ప్రథమ చికిత్స పెట్టెలో దగ్గు టానిక్‌ కచ్చితంగా ఉంటుంది. పిల్లలు దగ్గితే వైద్యుడి వద్దకు వెళ్లేకంటే ముందే ఉపశమనానికి దగ్గు మంది వాడితే తగ్గుతుందిలే అన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు.  దగ్గుకు చికిత్సగా దగ్గు టానిక్, డ్రాప్స్, వంటి అల్లోపతి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే  ఇంట్లో ఉండే ఔషదాలు అల్లోపతి మందుల కన్నా శక్తి వంతంగా పని చేస్తాయని నిరూపించబడింది. ఔషదాలు వాడే సమయంలో సరైన మోతాదులో వాడితే గుణం మంచిగా కనిపిస్తుంది.  అయితే దగ్గు మందు అయినా మందు బిల్లలు అయినా వేసుకునే సమయంలో ఖచ్చితంగా వాటి పరిమితి సమయం, డేట్ తప్పకుండా చూడాలి.

 

డేట్ దాటిపోయిన మెడిసన్స్ వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం జరుగుతుందని డాక్టర్లు సూచిస్తుంటారు.  తాాజాగా తగ్గు వస్తుందని వెళ్లితే అక్కడ ఇచ్చిన మందు తాగి తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలో పోగొట్టుకున్నారు. మరికొంత మంది అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు.  ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ  సంస్థ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్‌ జిల్లా చిన్నారులకు పంపింది. అయితే,  'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే విష పదార్థం 'కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్‌'లో ఉంది. ఆ టానిక్‌ను తాగడంతో 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు. గత నెల రోజుల నుంచి ఆ చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు.. కానీ ఫలితం లేదు.

 

అందులో తొమ్మిది మంది చిన్నారులు చనిపోయారు.  అయితే విష పదార్థం ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ మీడియాకు తెలిపారు. ఆ టానిక్‌ కారణంగా చిన్నారుల ఊపిరితిత్తులు చెడిపోయాయని వైద్యులు చెప్పారు. కాగా, సదరు సంస్థ ఉత్పత్తులను ఎనిమిది రాష్ట్రాల్లో బంద్ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: