దొంగ అంటే ఇంటిని మొత్తాన్ని దోచుకొని వెళ్తాడు. అవసరమైతే ఇంట్లోని యజమానుల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు. అలాంటిది ఈ దొంగ మాత్రం దొంగలందరూ ఒకేలాగా ఉండరని నిరూపించాడు. దొంగలకు కూడా మానవతా విలువలు ఉంటాయని తెలిపారు. ఓ దొంగ సైనికుల ఇంట్లో దొంగతనం చేయొద్దని నిబంధన పెట్టుకున్నాడు. ఆర్మీ యజమాని ఇల్లు అని తెలుసుకొని దొంగ తనం చేయకుండా వెనుదిరిగాడు. ఈ ఘటన ఎర్నాకుళం జిల్లా తిరువాన్‌కుళం‌లో చోటు చేసుకుంది. 

 

దొంగ దొంగతనం చేయకుండా క్షమించమని వేడుకుంటూ ఇంటి యజమాని, మాజీ సైనికుడైన ఐజాక్ మణికి లేఖ రాశాడు. ఈ ఘటన ఎర్నాకుళం జిల్లా తిరువాన్‌కుళం‌లో చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం ఆ ఇంట్లోని వారంతా బహ్రెయిన్ వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. పని మనిషి వచ్చి రోజూ ఇంటిని శుభ్రం చేసి వెళ్తుంది.

 

మరుసటి ఉదయం కూడా పనిమనిషి ఇంటి తలుపు తీసి ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వచ్చే చూడగా.. ఇంట్లోని వస్తువులేవీ పోలేదని గుర్తించారు. కానీ గోడమీద మాత్రం ఓ సందేశం రాసి ఉంది. ఇది సైనికుడి ఇల్లని నాకు తెలీదు. ఆర్మీ క్యాప్ చూసి చివరి నిమిషంలో తెలుసుకున్నానను. ఆఫీసర్.. నన్ను క్షమించండి. ఇది సైనికుడి ఇల్లని తెలిసి ఉంటే చొరబడే వాణ్ని కాదు’’ అంటూ రాశాడు.

 

రాత్రి ఆ ఏరియాలో ఐదు షాపుల్లో దొంగతనాలు జరిగాయని పోలీసులు గుర్తించారు. ఓ టైర్ల షాపులో చోరీ చేసిన క్యాష్ బ్యాగ్, మరో పర్సు సైనికుడి ఇంట్లో లభ్యమయ్యాయి. ఆ బ్యాగును యజమానికి తిరిగి ఇవ్వాలని సదరు దొంగ పోలీసులను కోరడం గమనార్హం. దొంగ రాసిన లేఖను బట్టి అతడు స్థానికుడు కాదని పోలీసులు భావిస్తున్నారు. వేలిముద్రల కోసం ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: