మనిషన్నాక దగ్గు జలుబు లాంటి రావడం కామన్ ఇలా దగ్గు జలుబు వచ్చినప్పుడు ఎక్కువగా డాక్టర్లు.. సిరప్ తాగాలి అని చెబుతూ ఉంటారు. సిరప్ తాగడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది అంటుంటారు. కానీ ఇక్కడ దగ్గు తగ్గడానికి టానిక్ తాగడం వల్ల తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. దగ్గు జలుబు తో బాధపడుతున్న చిన్నారులు టానిక్ తాగడం ద్వారా.. ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన జమ్మూకాశ్మీర్లో చోటుచేసుకుంది

 


 హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ సంస్థ వాటి ఉత్పత్తులను జమ్మూలోని ఉదయపూర్ జిల్లా చిన్నారులకు పంపింది. అయితే డై ఇథలిన్ గ్లైకాల్  అనే విష పదార్థం ఓల్డ్ బెస్ట్ పీసీ టానిక్  లో  ఉంది. అయితే దగ్గు తగ్గడానికి ఈ టానిక్కు తాగడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి  నెల రోజుల నుండి  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే వారిలో 9 మంది ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆ చిన్నారులు తాగిన టానిక్  లో విష పదార్ధం ఉండటం వల్లే ఇంతటి దారుణం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

 

 అయితే ఆ టానిక్ లో విష పదార్ధం ఉండటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది అంటూ అటు డ్రగ్ అండ్ ఫుడ్  కంట్రోల్ ఆర్గనైజర్ అసిస్టెంట్ కంట్రోలర్ మీడియాకు తెలిపారు. టానిక్ తాగడం వల్ల చిన్నారుల ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయని.. అందుకే చిన్నారులను కాపాడలేకపోయాము  అంటూ  వైద్యులు తెలిపారు ఆయన మీడియాకు తెలిపారు. ఈ ఘటనతో సదరు సంస్థ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో బంద్ చేసారు. ఇక తయారీ యూనిట్ను కూడా మూసి వేసినట్లు తెలిపారు  అధికారులు. ఇక తొమ్మిది మంది చిన్నారులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: