గత కొంత కాలంగా భారత దేశంలో కొంత మంది మతోన్మాధులు భారత్ కి వ్యతిరేక నినాదాలు చేస్తున్న విషయం తెలిసిందే.  కాశ్మీర్ సమస్యపై ఇప్పటికీ ఎన్నో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.  అక్కడ కొంత మంది మత ఉన్మాధులు పాకిస్థాన్ కి వత్తాసు పలుకుతున్నారు.  భారత్ గడ్డపై పుట్టి పెరిగి దాయాది దేశంపై మక్కువ చూపిస్తున్నారు.  తాజాగా బెంగళూరులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్న సీఏఏ వ్యతిరేక సభలో అమూల్య లియోన్ అనే యువతి పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దాంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.  బెంగళూరులో సీఏఏ ను వ్యతిరేకిస్తూ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా అమూల్య లియోనా అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్ చేసింది. ఆ స్లోగన్లపై స్పందించిన  అసదుద్దీన్ ఓవైసీ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. అయితే పాకిస్థాన్ కి జై కొట్టిన యువతికి తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఆమెను బీజేపీ నేతలే ఉసి కొల్పి ఉంటారని అన్నారు.  అయితే అసదుద్దీన్ మాటలపై అక్కడి నేతలు మండి పడుతున్నారు.  ర్యాలీలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని వారు అంటున్నారు.  కాగా, అమూల్య లియోన్ ఇంటిపై కొంతమంది దాడి చేసినట్లు సమాచారం. 

 

మరోవైపు సీఎం యెడియూరప్ప బెంగళూరులో సీఏఏ ను వ్యతిరేకిస్తూ ర్యాలీ జరిగిన సమయంలో అమూల్య అనే యువతి అలా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆమె గతంలో మావోయిస్టులతో సంబంధాలు ఉండి ఉంటాయని.. ఆమెపై గతంలో ఉన్న కేసులు కూడా వెలికి తీసే యోచనలో ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ లభించడం కష్టమే అని అన్నారు.  అంతే కాదు అమూల్య వెనుక ఉన్న సంస్థలు ఏమిటో దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంస్థలకు అడ్డుకట్టపడదని యెడియూరప్ప అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: