నేటి సమాజంలో విద్యాబుద్దులు చెప్పేవారు నేరగుణాలను కలిగి ఉంటున్నారు. సమాజం కూడా ఇలాగే తయారైంది. ఇక విద్యార్ధుల పరిస్దితి గురించి చెప్పవలసిన అవసరం లేదు. చక్కగా చదువుకుని జీవితంలో స్దిరపడురా అంటే పనికిమాలిన లవ్వును, ఒంటినిండా కొవ్వులా పట్టించుకుని, పార్టీలు, పబ్బులు అంటూ సమయాన్ని సబ్బులా కరిగిస్తున్నారు... వారి వారి జీవితాలను చేజేతులారా పాడుచేసుకుంటున్నారు..

 

 

తన కోపమే తన శత్రువు లాంటి మంచి బుద్ది చెప్పేవారు కరువైన ఈ లోకంలో ఇప్పుడు చదువుతున్న చదువులు బ్రతడానికి పనికిరావడం లేదని ఇప్పటికే ఎందరో విద్యార్ధులు వాపోతున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని గోమతినగర్‌లో, ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్యం చేశారు. అతని గుండెపై సుమారు పది సార్లు కత్తితో విచక్షణారహితంగా  పొడిచారు. ఇక ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది... పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

 

 

లక్నోలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న వారణాసికి చెందిన ప్రశాంత్‌ సింగ్‌ (23) అనే యువకుడు, తన స్నేహితుడిని కలిసేందుకు గురువారం సాయంత్రం గోమతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్దకు ఇన్నోవా కారులో వచ్చాడు. అతను తన కారును పార్కింగ్‌ చేస్తున్న సమయంలో, అప్పటి వరకు అతనికోసమే కాపుకాసిన యువకులు ఒక్క సారిగా అతడి మీద దాడి చేసి అతని గుండెపై కత్తితో కనికరం లేకుండా కసా కసా పొడిచేశారు.

 

 

ఈ దాడిలో దాదాపుగా 10 నుంచి 12 మంది యువకులు పాల్గొన్నారని అంచనా. కాగా ఎం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియని ఆ యువకుడు భయంతో తన చేతిని గుండెపై పెట్టుకుని అపార్ట్‌మెంట్‌లోకి పరుగెత్తాడు. ఈ లోపల సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి చూడగా.. బాధితుడు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో ప్రశాంత్‌ చనిపోయాడు...

 

 

ఇకపోతే ఈ గొడవ అంతటికి కారణం  ఓ బర్త్‌డే పార్టీ అని తెలిసిందట. అదేమంటే బుధవారం రాత్రి ప్రశాంత్‌ తన స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లగా, ఆ పార్టీలో తన జూనియర్లతో గొడవ జరిగిందట.. ఆ ఘటనను మనుసులో పెట్టుకున్న జూనియర్లు, ప్రశాంత్‌ ను హత్యచేయాలని పధకంతో ఈ దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: