ఇటీవ‌ల కాలంలో వ్యభిచారం అనేది సర్వసాధారణం అయిపోయింది. కొందరు యువతు లు తమ కుటుంబం లో ని ఆర్థిక పరిస్థితు ల వల్ల ఎక్కువ గా వ్యభిచారం అనే కూపం లో కి దిగుతున్నారు. మ‌రికొంద‌రు తెలియ‌కుండా మోస‌పోయి ఈ వ్య‌భిచార కుంప‌ట్లోకి లాగ‌బ‌డుతున్నారు. సినిమాలో నటించే అవకాశమంటారు.. ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగమంటారు.. బంగారు భవిష్యత్తును చూపిస్తామంటారు.. చివరకు నమ్మించి వ్యభిచార రొంపిలోకి దింపుతారు. దేశంలోని సగానికి సగంపైగా జిల్లాల్లో ఆడపిల్లలు అన్యాయంగా వ్యభిచార కూపాలకు తరలిపోతున్నారు.. వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారు. 

 

ఇక తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలోని ఓ ఇంట్లో కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టుర‌ట్టు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  కొట్టపాలయం ప్రాంతానికి చెందిన వి.శాంత(40) అనే మహిళ రాజా కాలనీలోని ఓ ఇంట్లో కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తోంది.  ఆర్థిక అవసరాలు ఉన్న 36ఏళ్ల మహిళను మభ్యపెట్టి ఆమె వద్దకు విటులను పంపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శాంతపై ఓ క‌న్నేసి ఉంచారు. ట్విస్ట్ ఏంటంటే.. ఏకంగా ఓ పోలీసునే విటుడిగా ఆమె వ‌ద్ద‌కు పంపించారు. దీంతో అక్క‌డ‌ వ్యభిచారం జరుగుతున్న నిర్ధారించుకున్న స్పెషల్ టీమ్ రైడ్ చేసింది. 

 

దీంతో అడ్డంగా దొరికిపోయింది శాంత‌. ఇక నిర్వాహకురాలు శాంతతో పాటు సెక్స్ వర్కర్‌ని అదుపులోకి తీసుకున్నారు. శాంత నాలుగు నెలల క్రితం ఆ ఇంటికి అద్దెకు తీసుకుని వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. పక్క పోర్షన్‌లోనే ఇంటి యజయాని నివసిస్తున్నా ఈ బాగోతం గురించి తెలియ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని, అనుమానానికి తావిస్తోంది. దీంతో అనేక కోణాల్లో ద‌ర్య‌ప్తు చేప‌ట్టారు. అలాగే శాంతపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జడ్జి ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: